టాలీవుడ్ లో ప్రముఖ నటి కన్నుమూశారు. అలనాటి పాతతరం నటి జయంతి (6) తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగలూరులోని తన నివాసంలో చనిపోయారు.
జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి 1963లో ‘జెనుగూడు’ అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగు , కన్నడ, తమిళం, మలయాళం , హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500పైగా చిత్రాల్లో ఆమె నటించారు.
ఎన్టీఆర్, ఎంజీఆర్, రజినీకాంత్, రాజ్ కుమార్ వంటి అగ్రహీరోల సినిమాల్లో యంతి కీలక పాత్రలు పోషించారు.
తెలుగులో జయంతి నటించిన పెదరాయుడు, బొబ్బిలియుద్ధం, కొండవీటి సింహం సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.