కరోనా మానవాళిపై చూపుతున్న ప్రభావం అంతా ఇంతా కాదు. కన్న వారిని కడచూపు చూసుకొనే భాగ్యానికి కూడా నోచుకోనివ్వడం లేదు. బాలీవుడ్ సీనియర్ హీరో, డిస్కో డాన్సర్ ఫేమ్ మిథున్ చక్రవర్తి తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కావాలనుకొంటే లాక్ డౌన్ అడ్డం వచ్చింది . దాంతో తండ్రి అంత్యక్రియలకు మిథున్ చక్రవర్తి వెళ్ళ లేని పరిస్థితి ఏర్పడింది. మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి మంగళవారం అర్దరాత్రి మరణించారు. 95 ఏళ్ల బసంత్ కుమార్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దాంతో ఈ విషయాన్ని బసంత్ కుమార్ చిన్న కొడుకు అయిన నిమాషి చక్రవర్తి అన్నయ్య మిథున్ చక్రవర్తి కి తెలియ జేశాడు. కానీ మిథున్ చక్రవర్తి కడసారి చూపుకి నోచుకోలేక పోయాడు .
గత కొంత కాలంగా మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో ముంబై హాస్పిటల్ చికిత్స పొందుతుండగా, మిథున్ చక్రవర్తి షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అలా వెళ్లి లాక్‌డౌన్ కారణంగా బెంగళూర్ లో ఇరుక్కు పోయి తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేక పోయాడట ….దాంతో తమ్ముడు నిమాషి చక్రవర్తి అన్న మిథున్ చక్రవర్తి స్థానంలో తండ్రి కర్మకాండలు చేయాల్సి వచ్చింది .