Homeఎంటర్టైన్మెంట్Star Hero: కుక్కలపై ఈ హీరోకు మమకారం.. ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.. ఇంతకీ...

Star Hero: కుక్కలపై ఈ హీరోకు మమకారం.. ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.. ఇంతకీ ఎవరాయన?

Star Hero: ప్రస్తుత కాలంలో మనుషుల్లో విశ్వాసం తగ్గిపోతుంది. స్వార్థం పెరిగిపోతూ పక్కవారిని ఇబ్బంది పెడుతున్నారు. మనం బాగుంటే చాలు.. పక్కవారికి ఏమైతేనేం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది జంతువులను పెంచుకుంటున్నారు. వీటిలో కుక్కలైతే స్వార్థం లేకుండా ఉంటాయని కొందరి భావన దీంతో వాటిని పెంచుకుంటూ సరదాగా ఉంటున్నారు. శునకం పెంచడం అంటే మాములు విషయం కాదు. మనిషితో సమానంగా వాటికి ప్రొటీన్ ఫుడ్ అందించాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మహా అయితే రూ.5000 వరకు ఉంటుంది కాబట్టి కొంత మంది ఈ ఖర్చు గురించి ఆలోచించకుండా వాటిని పెంచుకుంటారు. అయితే ఓ బాలీవుడ్ స్టార్ మాత్రం వందకు పైగా కుక్కలను పెంచుతున్నాడు. అంతేకాదు.. వీటి కోసం ఏకంగా రూ. 45 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా?

బీ టౌన్ నుంచి రిలీజ్ అయిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమా గురించి చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మిథున్ చక్రవర్తి. ఈ హీరో ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగాడు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగాడు. తెలుగులోనూ ‘గోపాల గోపాల’ అనే సినిమాలో స్వామిజీ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరో సినిమాల్లో నటించినంత కాలం బోలెడు డబ్బు సంపాదించాడు. దేశ వ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాల్లో హోటళ్లు, కార్టేజీలు నిర్మించాడు.

Also Read: Ranveer Singh: రన్వీర్ సింగ్ కి షాక్ ఇస్తున్న సౌత్ డైరెక్టర్స్…కారణం ఏంటంటే..?

అలాగే ముంబై పరిసర ప్రాంతంలోని మాద్ అనే ద్వీపంలో 1.5 ఎకరం భూమి ఉంది. దీనిని ఆయన ప్రత్యేకంగా కుక్కలను పెంచడానికి వాడుతున్నారు. మిథున్ చక్రవర్తికి కుక్కలంటే చాల ఇష్టం. అయితే ఒకటి,రెండు కాకుండా ఏకంగా 116 కుక్కలను ఈ ప్రదేశంలో ప్రత్యేకంగా పెంచుతూ వాటి బాగోగులను చూసుకుంటున్నాడు. అయితే కుక్కల కోసం కేర్ తీసుకోవాలంటే సమయం పడుద్ది. అందువల్ల వీటిని పెంచేందుకు కొంత మంది సిబ్బందిని కూడా నియమించాడు. వారే అంతా చూసుకుంటారు. మిథున్ చక్రవర్తి అప్పుడప్పుడు వెళ్లి వాటితో సరదాగా ఉంటారు.

Also Read: Ranbir Kapoor: అనిమల్ లాంటి బోల్డ్ సినిమా తర్వాత రణబీర్ రాముడుగా చేయడం కరెక్టేనా..?

ఈ విషయాన్ని మిథున్ చక్రవర్తి నేరుగా ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే ఇటీవల ఆయన కోడలు, నటి మాదాల్సా శర్మ ఓ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టారు. కుక్కల గురించి తమ మామ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పింది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిథున్ చక్రవర్తి బాగా డబ్బు సంపాదించినట్లు టాక్. ఆయన ఆస్తుల విలువ మొత్తం కలిపి రూ.400 కోట్లకు పైగా ఉంటుంది. అందువల్ల ఆయన కుక్కల కోసం ప్రత్యేకంగా రూ.14 కోట్లు ఖర్చు చేయడం ఆసక్తిగా మారింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version