https://oktelugu.com/

Ranbir Kapoor: అనిమల్ లాంటి బోల్డ్ సినిమా తర్వాత రణబీర్ రాముడుగా చేయడం కరెక్టేనా..?

మన సౌత్ లో ఉన్నట్టుగా అక్కడ రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఉండవు. కాబట్టి వాళ్లు బోల్డ్ సినిమాలా నుంచి దైవభక్తి సినిమా వరకు ఏదైనా సరే ఈజీగా చేసుకునే స్వేచ్ఛ మాత్రం వాళ్ళకి ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 22, 2024 / 09:00 AM IST

    Ranbir Kapoor

    Follow us on

    Ranbir Kapoor: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి నుంచి కూడా అక్కడ ఏ సినిమానైనా సరే తీయడానికి వాళ్లు సిద్ధంగా ఉంటారు. ఇక మన సౌత్ లో ఉన్నట్టుగా అక్కడ రిస్ట్రిక్షన్స్ పెద్దగా ఉండవు. కాబట్టి వాళ్లు బోల్డ్ సినిమాలా నుంచి దైవభక్తి సినిమా వరకు ఏదైనా సరే ఈజీగా చేసుకునే స్వేచ్ఛ మాత్రం వాళ్ళకి ఉంటుంది.

    అలా ఎలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అయినా సినిమా చేసుకోగల స్టామినాని ఏర్పరచుకున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రణ్బీర్ కపూర్ సాయి పల్లవి లీడ్ రోల్లో రామాయణం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో రన్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా వరకు విమర్శలైతే వస్తూనే ఉన్నాయి.

    ఇక ఈ సినిమాని చేయకూడదు అంటూ నిర్మాతలు కొంతమంది దర్శకుడి మీద కేసు వేశారు. ఇక ఇప్పుడు రన్బీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్ మీద కూడా చాలా విమర్శలైతే వస్తున్నాయి. ఇక సాయి పల్లవి మొదటి నుంచి కూడా తన పాత్రకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటేనే ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంటుంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆమె నాగచైతన్య తో ‘ తండేల్ ‘ అనే సినిమా చేస్తుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రీసెంట్ గా రన్బీర్ కపూర్ ‘అనిమల్ ‘ అనే ఒక బోల్డ్ సినిమా చేశాడు. ఈ సినిమా మీద బాలీవుడ్ లోనే కొన్ని విమర్శలైతే వచ్చాయి.

    ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడు రన్బీర్ కపూర్ రామాయణం సినిమాలో రాముడిగా చేయడం పట్ల కూడా కొంతమంది కొన్ని అభ్యంతరాలనైతే వ్యక్తం చేస్తున్నారు.ఇక దానికి మించి అలాంటి ఒక బోల్డ్ క్యారెక్టర్ లో ఇండియా మొత్తం రణ్బీర్ కపూర్ ను చూసిన తర్వాత హిందువుల ఆరాధ్య దైవంగా పూజించుకునే రాముడు పాత్రలో రణ్బీర్ కపూర్ చేస్తే ఆయన లో ఆ రాముడుని చూసుకోగలరా లేదంటే ఈ సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అనే విధంగా కూడా రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఏర్పడుతుంది అనేది…