Mithra Mandali Trailer Talk: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు మూస ధోరణిలో సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ప్రయోగాత్మకమైన సినిమాలు చేయడానికి మేకర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే నటులు సైతం ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక అనుదీప్ చేసిన ‘జాతి రత్నాలు’ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇక ఆ సినిమా స్ఫూర్తితో చాలా కామెడీ సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సక్సెస్ ని సాధిస్తే మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి. ప్రస్తుతం ప్రియదర్శి, మ్యాడ్ ఫేమ్ విష్ణు, రాగ్ మయూర్ ముగ్గురిని లీడ్ రోల్ లో పెట్టి డైరెక్టర్ విజయేందర్ చేస్తున్న ‘మిత్ర మండలి’ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటినుంచి చివరి వరకు కామెడీ వే లో చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది…ఇందులో కథ పెద్దగా లేకపోయినా కూడా సీక్వెన్స్ వైజ్ గా చూస్తే కామెడీని బాగా ఎలివేట్ చేసినట్టుగా తెలుస్తోంది. రాగ్ మయూర్, విష్ణు ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. ఆ అమ్మాయి వీళ్లిద్దరిలో ఎవరిని లవ్ చేసింది అనే దాని మీదనే ఈ సినిమా మొత్తం రన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్రైలర్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తానికైతే ప్రియదర్శి ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఈ మూవీ లో ప్రియదర్శి క్యారెక్టర్ ఏంటి అనేదాని మీదనే కొంతవరకు క్లారిటి ఇవ్వలేదు. సినిమా చూస్తే తప్ప క్యారెక్టర్ ఏంటి అనేది మనకు క్లారిటీ రాదు. ఇక ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో నింపేశారు. మరి ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దగా స్కోప్ అయితే లేదు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్ లాగానే ఈ సినిమాని చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ కామెడీ అనేది చివరి వరకు ఉంటే పర్లేదు ఏదైనా డివియేషన్స్ వస్తే మాత్రం సినిమా మీదనే ఎఫెక్ట్ పడవచ్చు. అలాగే సినిమాలో వచ్చే కామెడీ మొత్తాన్ని కలుపుతూ కథ ఉండాలి. కథ లేకుండా ఎంత కామెడీ చేసిన కూడా ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక కామెడీతో పాటు సినిమా కథ అందులో కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉండాలి.
అలా లేకపోతే సినిమా ఎంత సేపు చూసినా కూడా ఆ హై ఫీల్ రాదు. కాబట్టి వీటన్నింటి విషయంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేదని ఒకవేళ ఎమోషనల్ సన్నివేశాలని చూపించకుండా దాచి పెట్టినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తోంది అలాగే ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తోంది అనేది…
