https://oktelugu.com/

Lakshya Twitter Review: నాగశౌర్య ‘లక్ష్యం’ నెరవేరిందా?

Lakshya Twitter Review: యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీ థియేటర్లలో తాజాగా విడుదలైన నేపథ్యంలో అభిమానులు ట్వీటర్లో వారి స్పందన తెలియజేస్తున్నారు. అభిమానులు ‘లక్ష్య’పై ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ లక్ష్యాన్ని చేరుకుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..! యంగ్ హీరో నాగశౌర్యకు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తొలి హిట్టు అందుకున్న నాగశౌర్య ఆ తర్వాత అదే తరహా చిత్రాలను చేసుకుంటూ […]

Written By: NARESH, Updated On : December 10, 2021 12:10 pm
Follow us on

Lakshya Twitter Review: యంగ్ హీరో నాగశౌర్య తాజా చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీ థియేటర్లలో తాజాగా విడుదలైన నేపథ్యంలో అభిమానులు ట్వీటర్లో వారి స్పందన తెలియజేస్తున్నారు. అభిమానులు ‘లక్ష్య’పై ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ లక్ష్యాన్ని చేరుకుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

Lakshya Twitter Review

Naga Shaurya Lakshya

యంగ్ హీరో నాగశౌర్యకు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో తొలి హిట్టు అందుకున్న నాగశౌర్య ఆ తర్వాత అదే తరహా చిత్రాలను చేసుకుంటూ వెళ్లాడు. అయితే ఇటీవల తన పంథాను మార్చుకోని ప్రయోగాత్మక చిత్రాలను తెరక్కించడంతోపాటు నిర్మిస్తున్నారు. అలా నాగశౌర్య నుంచి వచ్చిన మూవీ ‘అశ్వద్దామ’.

‘అశ్వద్దామ’ కు మంచి విజయం దక్కడంతో నాగశౌర్య వరుసబెట్టి ప్రయోగాత్మక సినిమాలను చేస్తున్నాడు. తాజాగా నాగశౌర్య నుంచి వచ్చిన ‘లక్ష్య’ కూడా అలాంటి మూవీనే. భారత చలనచిత్ర రంగంలో తొలిసారిగా పూర్తి ‘అర్చరీ’ కథాంశంతో తెరకెక్కిన మూవీ ‘లక్ష్య’. స్పోర్ట్స్ బ్రాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీని ధర్మేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించగా శ్రీ వెంకట సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతోపాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది.

నాగశౌర్యకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేనప్పటికీ ట్రైలర్ తో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, టీజర్ కు మంచి వ్యూస్ రాగా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఒక్క యూఎస్‌లోనే ఈ మూవీ దాదాపు 120 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది.

Also Read: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, అనన్య కొత్త చిత్రం ప్రారంభం…

‘లక్ష్య’లో నాగచైతన్యకు జోడిగా కేతికశర్మ నటించింది. ‘అర్చరీ’ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు వాస్తవికతకు దగ్గరగా తీశాడు. ఫస్ట్ ఆఫ్ ఆద్యంతం కేవలం అర్చరీ నేపథ్యంలో సాగగా సెకండ్ ఆఫ్ లో కమర్షియల్ హంగులను అద్దాడు. దీంతో ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కొందరు ఈ మూవీ కనెక్ట్ కాగా మరికొందరు మాత్రం యావరేట్ అని చెబుతున్నారు.

సినిమాకు నాగశౌర్య యాక్షన్, ఎమోషనల్ సీన్స్, కేతికశర్మ గ్లామర్, కాలభైరవ అందించిన మ్యూజిక్ ప్రధాన బలంగా నిలిచాయి.  ‘లక్ష్య’ మూవీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదా ఫుల్ టాక్ రివ్యూ వస్తే కానీ చెప్పలేం. యాక్షన్ నాగశౌర్య అద్భుతంగా నటించాడు. మొత్తానికి నాగశౌర్య మరో ప్రయోగాత్మక మూవీతో ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపించాడు.

Also Read: నాగశౌర్య “లక్ష్య “సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్…