Mission Impossible 7 Collections: తొలి రోజే మిలియన్ డాలర్ల వసూళ్లు..డేంజర్ లో పడ్డ అవతార్ రికార్డ్స్!

ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు ఇండియా లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే 12 కోట్ల రూపాయిల నెట్, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు అన్నమాట. ఇప్పటి వరకు విడుదలైన హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 7 మూవీస్ లో ఒకటిగా నిల్చింది. ఇక అమెరికా మరియు ఇతర దేశాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తే నోరెళ్లబెట్టక తప్పదు.

Written By: Vicky, Updated On : July 13, 2023 11:25 am

Mission Impossible 7 Collections

Follow us on

Mission Impossible 7 Collections: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ సినిమాలను ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు, అతని చేసే సాహసపూరిత యాక్షన్ సన్నివేశాలను వెండితెర మీద చూసేందుకు ఎగబడతారు ఆడియన్స్.ఇండియా లో కూడా టామ్ క్రూజ్ కి వేరే లెవెల్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన హీరో గా నటించే ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ కి ఉండే క్రేజ్ మామూలుది కాదు.

ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్ నుండి ఆరు సినిమాలు విడుదలైతే ఆరు సినిమాలు కూడా ఒక దానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కలెక్షన్స్ పరంగా అద్భుతాలు సృష్టించాయి. ఇక నిన్న ఈ ఫ్రాంచైజ్ నుండి ‘మిషన్ ఇంపాజిబుల్ : ది డెడ్ రికనింగ్ పార్ట్ 1 ‘ విడుదలై అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇండియా లో కూడా మార్నింగ్ షోస్ నుండే మంచి ఆక్యుపెన్సీలతో ప్రారంభమైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు ఇండియా లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే 12 కోట్ల రూపాయిల నెట్, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు అన్నమాట. ఇప్పటి వరకు విడుదలైన హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 7 మూవీస్ లో ఒకటిగా నిల్చింది. ఇక అమెరికా మరియు ఇతర దేశాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు చూస్తే నోరెళ్లబెట్టక తప్పదు.

అమెరికన్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 150 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది అట. దీనిని ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చూస్తే అక్షరాలా 1229 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చిందట. ఇదే రేంజ్ ఊపులో వీకెండ్ వరకు కొనసాగితే, అవతార్ రికార్డ్స్ కూడా డేంజర్ లో పడడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.