Mirchi Movie Heroine: దగ్గుపాటి రానా మరియు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లీడర్ అనే సినిమా ద్వారా మనందరికీ పరిచయం అయిన హాట్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ..తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి..వరుసగా ఆఫర్లు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకొని కెరీర్ లో సూపర్ హిట్స్ అందుకుంది..ఈమె టాలీవుడ్ లో లీడర్ సినిమా తర్వాత మిరపకాయ్, సారొచ్చారు,భాయ్ మరియు మిర్చి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..వీటిల్లో మిరపకాయ్ మరియు మిర్చి సినిమాలు భారీ హిట్ గా నిలవడమే కాకుండా రిచా గంగోపాధ్యాయ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది..అలా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం మరియు బెంగాలీ సినిమాల్లో కూడా నటించిన ఈ అందాల తార అకస్మాత్తుగా మాయమైపోయింది..వరుసగా క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేసుకుంటూ కెరీర్ లో పీక్ స్టేజి అని ఎంజాయ్ చేస్తున్న సమయం లో మాస్టర్స్ చదవడం కోసం సినిమాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పేసి అమెరికా కి వెళ్ళిపోయింది..ఈమె టాలీవుడ్ మన అందరికి చివరిసారిగా వెండితెర మీద కనిపించిన సినిమా అక్కినేని నాగార్జున హీరో గా నటించిన భాయ్.

ఆ సినిమా తర్వాత శాశ్వతంగా నటనకి గుడ్బై చెప్పేసి మాస్టర్స్ చదవడం కోసం అమెరికా కి వెళ్ళిపోయింది..అక్కడ జోలంగేళ్ల అనే అతనితో ప్రేమలో పడిన రిచా గంగోపాధ్యాయ పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసేసుకుంది..ఈ ఇద్దరి దంపతులకు లూకా షాన్ జోలంగేళ్ల అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు..చాలా కాలం తర్వాత తన భర్త మరియు బిడ్డతో తో కలిసి ఉన్న ఫోటోలను రిచా గంగోపాధ్యాయ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది..ఈ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..ఎందుకంటే రిచా గంగోపాధ్యాయ ఇంతకుముందు సినిమాల్లో నటిస్తున్నప్పటికంటే అందంగా తయారు అయ్యింది..బొద్దుగా చూడముచ్చటగా తయారైన రిచా గంగోపాధ్యాయ ఫోటోలను చూసిన అభిమానులు ఎంతో మురిసిపొయ్యి తెగ షేర్లు కొడుతున్నారు..సాధారణంగా ఏ అమ్మాయి అయిన పెళ్ళై ఒక్క బిడ్డకి జన్మని ఇచ్చిన తర్వాత తమ అందాన్ని కోల్పోవడం మనం గమనిస్తూనే ఉన్నాము..కానీ రిచా విషయం లో అది పూర్తిగా రివర్స్ అయ్యింది అనే చెప్పాలి.

Also Read: Ram Charan Upasana Konidela: రాంచరణ్, ఉపాసనలకు పిల్లలు లేకపోవడానికి అసలు కారణం అదేనట?