Pavan Kalyan Worked As Assistant Director: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ వంటి పదాలు వినిపిస్తే మనకి ముందుగా ఉర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి కూడా తనదైన యాక్టింగ్ స్టైల్ లో ఆంధ్ర యూత్ కి ఐకాన్ లాగ మారిపోయాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి నటన మీద ఏ మాత్రం ఆసక్తి లేదు..ఆయన ద్రుష్టి మొత్తం దర్శకత్వం పైనే..ఇండస్ట్రీ లోకి కూడా ఆయన డైరెక్టర్ గానే అడుగుపెట్టాలని అనుకున్నాడు..కానీ ఆయన వదిన సురేఖ గారి పట్టుదల వల్ల హీరో అవ్వాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ ఇదివరకు మనకి ఎన్నో సార్లు తెలిపాడు..హీరో గా మారినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ దర్శకత్వ శాఖ పై ఎప్పుడు ఒక్క కన్ను వేసి ఉంటాడు..ప్రతి సినిమాలోనూ తన మార్కు కనపడడం కోసం డైరెక్టర్లకు ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటాడు..తమ్ముడు , బద్రి మరియు ఖుషి వంటి సినిమాలకు పవన్ కళ్యాణ్ అనధికారిక దర్శకుడు అని ఇండస్ట్రీ లో వినిపించే వార్త..ఆయన స్నేహితులు కూడా పలు ఇంటర్వూస్ లో ఈ విషయాన్నీ తెలిపిన సందర్భాలు ఉన్నాయి..కానీ ఆయన అధికారికంగా దర్శకత్వం వహించిన ఏకైక సినిమా జానీ మాత్రమే..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ చేసిన కొత్త ప్రయోగం కి మంచి మార్కులే పడ్డాయి..ఇక ఈ సినిమా తర్వాత ఆయన చేసిన గుడుంబా శంకర్ కి కూడా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించాడు..ఇది బాక్స్ ఆఫీస్ వద్ద యావేరేజ్ ఆడింది.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ దర్శకత్వం లో ప్రత్యేక కోర్స్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక సినిమాకి పని చేసాడు అనే విషయం చాలా మందికి తెలియదు..నాగబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ కే.బాలచందర్ మరియు చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కించిన రుద్రవీణ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ..ఒక్క గొప్ప చిత్రాన్ని తీసిన అనుభూతిని ప్రేక్షకులకు అందించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి అప్పట్లో జాతీయ పురస్కారం కూడా దక్కగా నటుడిగా మెగాస్టార్ చిరంజీవి శిఖరాగ్ర స్థాయికి చేర్చించి ఈ సినిమా..అయితే ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ పనిచేసాడట..కే.బాలచందర్ లాంటి మహానుభావుడి కింద పని చేస్తే దర్శకత్వం లో ఎన్నో మెళుకువలు తెలుసుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో చిరంజీవి రెకమెండేషన్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడట పవన్ కళ్యాణ్..అలా పవన్ కళ్యాణ్ ఒక్క క్లాసిక్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.
Also Read: Rewanth Reddy- Sharmila: షర్మిలను కలుపుకుంటున్న రేవంత్ రెడ్డి