Rewanth Reddy- Sharmila: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే తన నడక కొనసాగిస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పాదయాత్రపై రకరకాల కామెంట్లు వచ్చినా ఆమె పట్టించుకోలేదు గతంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి షర్మిల తెలంగాణలో ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టుకున్నారని ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షర్మిలపై సెటైర్లు వేసినా ప్రస్తుతం మాత్రం ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించడం సంచలనం కలిగిస్తోంది.
ఇన్నాళ్లు షర్మిల పార్టీని, ఆమెను విమర్శలు చేసిన వారే ఇప్పుడు రమ్మని పిలవడంతో ఆమె కూడా కాదనలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఆహ్వానానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు. పాదయాత్ర ఆపి అఖిలపక్ష సమావేశానికి రావాలని సంకల్పించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న షర్మిలకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన పిలుపుతో మమ్మల్ని కూడా గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Land Expatriates: బంగారు తెలంగాణలో నిర్వాసితుల పరిస్థితిదీ
ఇప్పటికే తెలంగాణలో గుర్తింపు కోసం ఆరాటపడుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అఖిలపక్షం సమావేశానికి రావాలని కోరటంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పార్టీని కూడా గుర్తించి సమావేశానికి రావాలని పిలవడంపై అందరిలో సందేహాలు వస్తున్నా తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకు చెబుతున్న క్రమంలో ఆమెకు కూడా చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై ఆలోచనలు మాని అఖిలపక్ష సమావేశం విజయవంతం చేయడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
షర్మిల తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలను విమర్శిస్తూ పాదయాత్ర చేసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఆఫర్ ను కాదనలేక పాదయాత్రను మధ్యలోనే ఆపేసి అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలను విమర్శించిన షర్మిల ప్రస్తుతం వారితో కలిసేందుకు వెళ్లడంపై అందరిలో అనుమానాలు వస్తున్నా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని నిజం చేస్తూ షర్మిల తన ప్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. అధికారమే ఎజెండా అన్ని పార్టీలు తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఆ పార్టీ లనేతలు చెబుతున్నా తాము సైతం పోటీలో ఉన్నామని కాంగ్రెస్ కూడా తన సత్తా చాటాలని భావిస్తోంది. దీని కోసమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Chai Pani: అమెరికాలోనూ భారతీయుల రుచులదే హవా.. ఉత్తమ రెస్టారెంట్ గా ‘చాయ్ పానీ’