Mirai Box Office Collections: ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ ట్రెండ్ లో ఆడియన్స్ థియేటర్ కి కదిలి రావడం అనేది చాలా పెద్ద టాస్క్. కానీ కచ్చితంగా థియేటర్ లోనే చూడాలి అనిపించే కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తే మాత్రం నెత్తిన పెట్టుకొని మరీ ఆరాధిస్తున్నారు. అందుకు రీసెంట్ ఉదాహరణ తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చినా రెండు వారాల రన్ మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఆ తర్వాత ఓజీ చిత్రం వస్తుంది, మిరాయ్ కలెక్షన్స్ బాగా తగ్గిపోతాయి అని విశ్లేషకులు సైతం అనుకున్నారు. కానీ ‘మిరాయ్’ కలెక్షన్స్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఓజీ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది, భారీ వసూళ్లు వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
అయినప్పటికీ కూడా మిరాయ్ పై ప్రభావం పడలేదు. ఇక ఓజీ విడుదలైన వారానికి ‘కాంతారా 2’ కూడా విడుదలైంది. ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది, భారీ వసూళ్లు వస్తున్నాయి, కానీ మిరాయ్ పై ఈ చిత్రం కూడా ప్రభావం చూపలేకపోయింది. పాతిక రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక్క నైజాం ప్రాంతం లోనే ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరో కి వచ్చేంత వసూళ్లు ఈ చిత్రానికి రావడం అనేది చిన్న విషయం కాదు. అదే విధంగా సీడెడ్ లో 6 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఉత్తరాంధ్ర నుండి 5 కోట్ల 20 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల 90 లక్షలు వచ్చాయి.
అదే విధంగా వెస్ట్ గోదావరి జిల్లా నుండి కోటి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, గుంటూరు నుండి రెండు కోట్ల 50 లక్షలు, కృష్ణ జిల్లా నుండి రెండు కోట్ల 80 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 48 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక కర్ణాటక నుండి 5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 10 కోట్లు, ఓవర్సీస్ నుండి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.