Mirai Movie vs OG Movie: టాలీవుడ్ కి ప్రస్తుతం ఒక భారీ హిట్ కావాలి, ఈ ఏడాది విడుదలైన సినిమాలు అత్యధిక శాతం డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. చిన్న సినిమాలే ఇప్పుడు ఇండస్ట్రీ ని వెంటిలేటర్ పై ఉంచి ఆక్సిజన్ ని అందిస్తున్నాయి. ఇలాంటి సమయం లో సెప్టెంబర్ 12 న విడుదల కాబోతున్న ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి ఆడియన్స్ ని, ట్రేడ్ ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా థియేట్రికల్ ట్రైలర్ కి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదే విధంగా ‘వైబ్ ఉంది బేబీ’ పాట కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ఇప్పుడు ఓజీ మేనియా పెద్ద తలనొప్పి గా మారింది.
రీసెంట్ గా జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారీ సంఖ్యలో పాల్గొన్న అభిమానులు ‘ఓజీ..ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా ఇదే పరిస్థితి. హీరో తేజ సజ్జ మాట్లాడుతున్న సమయం లో ఈ నినాదాలు భారీగా వినిపించాయి. మిరాయ్ ఒక రెండు వారాలు ఆడిన తర్వాత మీతో పాటు మేము కూడా ఓజీ మేనియా లో మునిగి తేలుతాం అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రసంగం సమయం లో కూడా ఇవే నినాదాలు రావడం తో, ఆయన కూడా అదే సమాధానం చెప్పాడు. ఇక నిన్న జరిగిన ఈవెంట్ కూడా ఇదే పరిస్థితి. పాపం మిరాయ్ టీం ఎక్కడికి వెళ్లినా ఓజీ(They Call Him OG) మేనియా నే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు అసలు ఎక్కడా ఆగడం లేదు.
ఇలా ఇతర హీరోల సినిమా ఫంక్షన్స్ కి వెళ్లి ఓజీ..ఓజీ అని అరిస్తే ఏమి లాభం ఉంటుంది. పాపం వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు అంటుంటే,మరి కొంత మంది మాత్రం జనాల్లో ఓజీ ఫీవర్ తారా స్థాయికి చేరుకుంది. ఇలాంటి సమయం లో ఇప్పుడు ఏ సినిమా విడుదలైనా, ఆ సినిమా పై ఓజీ ప్రభావం పడక తప్పదు. అదే విధంగా ఈవెంట్స్ లో కూడా ఆ మేనియా నే కనిపిస్తాది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇతర సినిమాల్లో వేరే సినిమా నినాదాలు వినిపిస్తే కాస్త ఇబ్బంది గానే ఉంటుంది. హీరో హీరోయిన్లు పైకి నవ్వుతూనే కనిపించినా, లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటారు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.