https://oktelugu.com/

Animal Pre Release Event: రష్మిక పేరు మార్చేసిన మినిస్టర్ మల్లారెడ్డి… మహేష్ నవ్వులే నవ్వులు! వీడియో వైరల్

వేదిక మీద మినిష్టర్ మల్లారెడ్డి మాట్లాడారు. తనదైన ప్రసంగంతో ఆడియన్స్ లో జోష్ నింపారు. అయితే హీరోయిన్ రష్మిక మందాన పేరు ఆయన పలికిన తీరు నవ్వులు పూయించింది. ఆయన రష్మికకు కొత్త పేరు పెట్టారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2023 / 02:26 PM IST
    Follow us on

    Animal Pre Release Event: సోమవారం రాత్రి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో స్టార్స్ సందడి నెలకొంది. రన్బీర్ కపూర్-రష్మిక మందాన కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యానిమల్ ప్రీ రిలీజ్ వేడుకగా ఘనంగా నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్ కి మహేష్ బాబు, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. యానిమల్ చిత్ర యూనిట్ సందీప్ రెడ్డి వంగా, రన్బీర్ కపూర్, రష్మిక మందాన, అనిల్ కపూర్, భూషణ్ కుమార్, దిల్ రాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.

    ఈ వేదిక మీద మినిష్టర్ మల్లారెడ్డి మాట్లాడారు. తనదైన ప్రసంగంతో ఆడియన్స్ లో జోష్ నింపారు. అయితే హీరోయిన్ రష్మిక మందాన పేరు ఆయన పలికిన తీరు నవ్వులు పూయించింది. ఆయన రష్మికకు కొత్త పేరు పెట్టారు. ఇవాళ మన మల్లారెడ్డి యూనివర్సిటీకి మన మహేష్ బాబు, రన్బీర్ కపూర్, రషీదా…వచ్చారు అన్నారు. రష్మికను కాస్తా రషీదా చేశారు. మల్లారెడ్డి స్పీచ్ కి వేదిక ముందున్న మహేష్ బాబు పడి పడి నవ్వారు.

    ఇక ముంబై పాతది అయిపోయింది. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అడ్డా హైదరాబాద్. ఓ పదేళ్లలో ముంబై వాళ్ళు హైదరాబాద్ వచ్చేయాలని ఆయన అన్నారు. టాలీవుడ్ లో రాజమౌళి, దిల్ రాజు వంటి దిగ్గజాలు ఉన్నారని అన్నారు. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ మూవీ చూసి ఎంపీ అయ్యానని మల్లారెడ్డి చెప్పడం విశేషత సంతరించుకుంది.

    దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. యానిమల్ ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సందీప్ రెడ్డి అసలైన వైలెన్స్ అంటే ఏమిటో చూపిస్తానని చెప్పడం విశేషం. రన్బీర్ కపూర్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. అనిల్ కపూర్ కీలక రోల్ చేస్తున్నారు. ఇక బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా యానిమల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.