Bigg Boss 7 Telugu: మొదటి రౌండ్ లో తప్పుకున్న టైటిల్ ఫేవరేట్స్ శివాజీ, ప్రశాంత్… ఫైనల్ కి వెళ్ళేది ఎవరు?

13వ వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్ మీద జరిగాయి. కాగా తాజాగా ప్రోమోలో ' ఫినాలే అస్త్ర' కి సంబంధించిన రేస్ మొదలైంది.

Written By: NARESH, Updated On : November 28, 2023 2:47 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 12వ వారం డబల్ ఎలిమినేషన్ తో అశ్విని , రతికలను హౌస్ నుండి బయటకు పంపించేశారు. 13వ వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్ మీద జరిగాయి. కాగా తాజాగా ప్రోమోలో ‘ ఫినాలే అస్త్ర’ కి సంబంధించిన రేస్ మొదలైంది. ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు హౌస్ మేట్స్ కి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. అయితే ముందుగా నామినేషన్స్ గురించి హౌస్ మేట్స్ చర్చించారు. ఇన్ని వారాలు నామినేషన్స్ జరగలేదంటా అని శోభా ,ప్రియాంక తో అన్నది.

ఇక శివాజీ .. మనోడు అర్జున్ అతి తెలివితేటలు ఏంటో నాకు అర్థం కాలే .. అంత వంకరగా ఆలోచిస్తాడని అనుకోలేదు నేను అంటూ ప్రశాంత్ తో అన్నాడు. అమర్ ,ప్రశాంత్ గురించి చెబుతూ వాడు నమ్మకద్రోహం అనే పదాన్ని ఎందుకు వదిలేశాడంటే బయటకి జనాలకి చూపించడానికి అని అమర్ అన్నాడు. తర్వాత ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ కోసం ఓ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.

ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ ఒక్కో స్టాండ్ పై నిల్చోబెట్టి మధ్యలో ఒక పెద్ద రాడ్ రౌండ్ గా తిరిగేల ఏర్పాటు చేశారు. ఇది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇది తమ కాలికి తగలకుండా హౌస్ మేట్స్ సరైన సమయంలో పైకి ఎగురుతూ వీలైనంత ఎక్కువ సేపు ఉండాలి. ఇక ఆట మొదలైన కాసేపటికే ప్రశాంత్ అవుట్ అయ్యాడు. తర్వాత గౌతమ్, శోభా కాలికి రాడ్ తగిలి కిందపడిపోయారు.

తర్వాత శోభా, ప్రశాంత్ ని సంచాలకులుగా పెట్టాడు బిగ్ బాస్. శివాజీ కాలికి తగిలింది. ఆయన అవుట్ అంటూ శోభా చెప్పింది. ఇక యావర్ కూడా రేస్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత అమర్ అవుట్ అంటూ ప్రశాంత్ చెప్పాడు. ఇక చివరికి ప్రియాంక, అర్జున్ రేస్ లో నిలిచారు. ప్రోమో చివర్లో ఎవరో కింద పడితే.. లేపడానికి శివాజీ, శోభా పరిగెత్తినట్టు చూపించారు. మరి ఎవరు గెలిచారు అనేది సస్పెన్స్ లో పెట్టారు.