https://oktelugu.com/

టాలీవుడ్లో మరో విషాదం..

టాలీవుడ్లో ఒకేరోజు రెండు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాతతరం నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ మరణ సంఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్(58) మృతిచెందారు. ఆయన దేశవిదేశాల్లో పదివేలకు పైగా మిమిక్రి ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన మృతిపట్ల పలువురు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. హరికిషన్ మృతితో టాలీవుడ్లో విషాద చాయలు నెలకొన్నాయి. హరికిషన్ మే 30, 1963లో ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే తన పాఠశాలలోని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 23, 2020 / 04:16 PM IST
    Follow us on


    టాలీవుడ్లో ఒకేరోజు రెండు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాతతరం నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ మరణ సంఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది. కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు హరికిషన్(58) మృతిచెందారు. ఆయన దేశవిదేశాల్లో పదివేలకు పైగా మిమిక్రి ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన మృతిపట్ల పలువురు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. హరికిషన్ మృతితో టాలీవుడ్లో విషాద చాయలు నెలకొన్నాయి.

    హరికిషన్ మే 30, 1963లో ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయస్సు నుంచే తన పాఠశాలలోని ఉపాధ్యాయులు, తోటి స్నేహితుల గొంతును అనుకరిస్తూ నవ్వులు పూయించేవాడు. తన 12వ యేటా తొలి ప్రదర్శన ఇచ్చాడు. తాను మిమిక్రి ఆర్టిస్టు కావడానికి తన బంధువు చూడామణితోపాటు మిమిక్రీ కళాకారుడు నేరేళ్ల వేణుమాధవ్ స్ఫూర్తి అని చెబుతూండేవారు. కొన్నిరోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసిన హరికిషన్ ఆ తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఫుల్ టైమ్ మిమిక్రి ఆర్టిస్టుగా రాణించారు. సినీ, రాజకీయ నాయకులు గొంతులను అనుసరిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక గంటలో 100కుపైగా వాయిస్ లను అనుసరించి ‘శతకంఠ ధ్వన్యనుకరుణ ధురీణ’ బిరుదును పొందారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చేశారు.