Vijay Devarakonda Liger Movie: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమాలో ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ స్పెషల్ రోల్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మైక్ టైసన్ రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. మైక్ టైసన్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

సినిమాలో విజయ్ దేవరకొండకి తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది. రమ్యకృష్ణ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. తాను ఒక పులి లాంటోడికి జన్మను ఇవ్వాలని.. ఆమె కావాలని మైక్ టైసన్ కలుసుకుని.. అతనితో కొడుకును కంటుంది అని.. ఆ కొడుకు పాత్రలోనే విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు అని.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.
అయితే, మైక్ టైసన్ తో తాను కలిసి పని చేయడంపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశాడు. క్లైమాక్స్ కి ముందు వచ్చే ఓ ఫైట్ సన్నివేశంలో మైక్ టైసన్ విజయ్ దేవరకొండ తల పై పంచ్ ఇచ్చాడట. ఆ పంచ్ దెబ్బతో విజయ్ దేవరకొండ బ్రెయిన్ షేక్ అయిందట. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా చెబుతూ.. ‘టైసన్ పంచ్‌నే తట్టుకొని నిలబడగలిగానంటే ఇక దేన్నైనా తట్టుకోగలననే నమ్మకం వచ్చింది’ అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
అన్నట్టు.. లైగర్ సినిమాలో మైక్ టైసన్ ఫైట్ సినిమా కథనే మలుపు తిప్పుతుందని.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశం కూడా ఈ ఫైట్ సీక్వెన్స్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. పైగా దాదాపు 3 కోట్లు ఖర్చు పెట్టి మరి ఈ సీక్వెన్స్ ను షూట్ చేశారట. కాగా వచ్చే నెలలో ఫస్ట్ వీక్ లోపు ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కానుంది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పూర్తి కావాల్సి ఉంది.

బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి అయితే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రేక్షకులు కూడా ఆ స్థాయి అంచనాలు పెట్టుకుంటే సినిమాకి కలెక్షన్స్ వస్తాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.