Bigg Boss 9 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో వస్తున్నా ట్విస్టులు లోపల ఉన్న హౌస్ మేట్స్ తో పాటు, ఆడియన్స్ కి కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. టాస్కులు విషయం లోనే కాదు, ఎలిమినేషన్స్ విషయం లో కూడా గత రెండు వారాలు ఎలాంటి ట్విస్టులు వచ్చాయో మనమంతా చూసాము. మొదటి 5 వారాలు బ్లాక్ బస్టర్ టాస్కులతో, ఎంటర్టైన్మెంట్ తో సాగిన ఈ బిగ్ బాస్ షో, ఈ వారం మాత్రం బాగా డౌన్ అయిపోయింది. కంటెస్టెంట్స్ కి ఇచ్చిన టాస్కులతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఇమ్మానుయేల్ అప్పుడప్పుడు జోకులు వేయకపోతే, జియో హాట్ స్టార్ లో లైవ్ చూసే ఆడియన్స్ కి పిచ్చి ఎక్కడం ఖాయం. అంత బోరింగ్ గా సాగుతుంది బిగ్ బాస్ షో. ఇది బిగ్ బాస్ టీం కి కూడా అనిపించిందో ఏమో తెలియదు హౌస్ లోకి అమర్ దీప్, అంబటి అర్జున్ లను పంపారు.
కాసేపటి క్రితమే విడుదలైన రెండవ ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో అమర్, అర్జున్ పోలీస్ గెటప్ లో వస్తారు. హౌస్ లో కంటెస్టెంట్స్ ని బెదరగొడుతూ ఉంటారు. వీళ్లిద్దరి టాస్క్ ఏమిటంటే హౌస్ లో తలదాచుకున్న మాధురి, సంజన అనే గ్యాంగ్ స్టర్స్ ని వెతికి పట్టుకోవడమే. మధ్యలో హౌస్ బెడ్ రూమ్ లోకి వెళ్లి అమర్ దీప్ చేసిన కామెడీ ని మనమంతా ప్రోమో లో చూసాము. అయితే హౌస్ మేట్స్ అందరికీ వీళ్లిద్దరు ఊహించని షాక్ ని ఇస్తూ, బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టారని, బుధవారం వరకు జరిగిన ఓటింగ్ లో ఎవరికీ అయితే తక్కువ ఓట్లు వచ్చాయో, వాళ్ళని ఎలిమినేట్ చేసి బయటకు మాతో పాటు తీస్కొని రమ్మన్నారని అమర్, అర్జున్ లు చెప్తారు.
ఆ తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ ఒక లైన్ లో నిల్చోబెట్టి, సస్పెన్స్ ని మైంటైన్ చేస్తూ రాము రాథోడ్ పై చేతులు వేస్తారు. ఆ తర్వాత మెయిన్ డోర్ నుండి అతన్ని తమతో పాటు తీసుకెళ్తారు. హౌస్ మేట్స్ అందరూ షాక్. అసలు ఇంట్లో ఏమి జరుగుతుందిరా?, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఏంటి?, రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలోపు అమర్ దీప్, అర్జున్ లు మెయిన్ డోర్ నుండి లోపలకు రాము రాథోడ్ తో కలిసి వచ్చి, ఇదంతా ప్రాంక్ అని చెప్తారు. ఈ ఎపిసోడ్ మొత్తం చాలా హైలైట్ గా ఉంటుందని టాక్. చూడాలి మరి వీళ్లిద్దరు కలిసి హౌస్ లో పుట్టించే కామెడీ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.