OG Sequel: ఈమధ్య కాలం లో ప్రతీ పెద్ద సినిమా చివర్లో సీక్వెల్ ని ప్రకటించడం, దానికి అనుగుణంగా క్లిఫ్ హ్యాంగర్స్ క్రియేట్ చేయడం చాలా సాధారణమైన విషయం అయిపోతుంది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ ని ప్రకటించడం లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇదేమి సినిమా రా బాబు అని అనుకునే సినిమాలకు కూడా సీక్వెల్స్ ని ప్రకటిస్తున్నారు ఈమధ్య. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఆడియన్స్ నుండి నిజంగా సీక్వెల్ కావాలని డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమాల్లోనే ఒకటి ‘ఓజీ'(They Call Him OG) సీక్వెల్. సుజిత్ దర్శకత్వం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో క్లీన్ హిట్ గా నిల్చిన చిత్రమిది. ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వెర్షన్ నుండి 315 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమా క్లైమాక్స్ లో జపాన్ బ్యాక్ డ్రాప్ లో ‘ఓజీ ‘ ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజీత్ అధికారిక ప్రకటన చేస్తాడు. థియేటర్ మొత్తం ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోతాది. ఎదో నామమాత్రంగా ప్రకటించారు, పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ లో ఓజీ ప్రీక్వెల్ అసాధ్యం అని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చెయ్యడానికి సుజీత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం సుజిత్ నాని తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ‘ఓజీ’ ప్రీక్వెల్ ఉండబోతుంది అట. అంటే 2027 వ సంవత్సరం మధ్యలో నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు అవ్వొచ్చు.
ఒకవేళ షారుక్ ఖాన్ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటే, ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో నుండే మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయట. ఓజీ ప్రీక్వెల్ కోసం పవన్ కళ్యాణ్ దాదాపుగా 60 రోజుల కాల్ షీట్స్ ని ఇచ్చాడట. ఈ ఓజీ ప్రీక్వెల్ లో ఓజాస్ గంభీర చిన్నతనం నుండి ప్రకాష్ రాజ్ తో కలిసి ముంబై కి రావడం, ఆ తర్వాత ఇంట్లో జరిగిన ఒక సమస్య కారణంగా, ప్రకాష్ రాజ్ కి దూరంగా ముంబై వదిలి 15 ఏళ్ళు దూరంగా వెళ్లడం. ఆ 15 ఏళ్లలో జపాన్ కి మళ్లీ తిరిగొచ్చిన ఓజాస్ గంభీర ఎలాంటి రక్తపాతం అక్కడ సృష్టించాడు?, యాకూజా సామ్రాజ్యాన్ని మొత్తం ఎలా కూల్చి వేసాడు?, ఓజా గంభీర తండ్రి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి మధ్య ఉన్న లింక్ ఏంటి?, ఇలాంటి అంశాలను చాలా ఆసక్తికరంగా రాసి పెట్టుకున్నాడు సుజిత్. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎంత వరకు కార్యరూపం దాలుస్తుంది అనేది.