రివ్యూ: ‘మెరిసే మెరిసే’..సినిమా ఎలా ఉందంటే?

  దర్శకత్వం: పవన్ కుమార్.కె,  సంగీతం: కార్తిక్‌ కొడగండ్ల,  సినిమాటోగ్రఫర్: గేశ్ బానెల్. స్క్రీన్ ప్లే : పవన్ కుమార్.కె,  నిర్మాత: వెంకటేష్ కొత్తూరి. నటీనటులు :   దినేష్ తేజ్, శ్వేతా అవస్తి  త‌దిత‌రులు.   ‘మెరిసే మెరిసే’ అంటూ  దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ  సినిమా  పవన్ కుమార్ కె. దర్శకత్వంలో  తెరకెక్కింది.  వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను […]

Written By: NARESH, Updated On : August 6, 2021 5:10 pm
Follow us on

 

దర్శకత్వం: పవన్ కుమార్.కె,  సంగీతం: కార్తిక్‌ కొడగండ్ల,  సినిమాటోగ్రఫర్: గేశ్ బానెల్.
స్క్రీన్ ప్లే : పవన్ కుమార్.కె,  నిర్మాత: వెంకటేష్ కొత్తూరి.

నటీనటులు :   దినేష్ తేజ్, శ్వేతా అవస్తి  త‌దిత‌రులు.  

‘మెరిసే మెరిసే’ అంటూ  దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన ఈ  సినిమా  పవన్ కుమార్ కె. దర్శకత్వంలో  తెరకెక్కింది.  వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో  రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

*కథాకమామీషుకి వస్తే…  

సిద్ధు (దినేష్ తేజ్) ఒక స్టార్టప్  కంపెనీ పెట్టి  ఫెయిల్ అయ్యాడని.. ఇక అన్ని వదిలేసి ఖాళీగా తిరుగుతూ తాగుతూ కాలక్షేపం చేస్తుంటాడు. ఇంతకీ అతను ఎందుకు ఫెయిల్ అయ్యాడు ? అసలు అతను దేనిలో ఫెయిల్ అయ్యాడు కూడా దర్శకుడు క్లారిటీగా చూపించలేదు. ఇక వెన్నెల ( శ్వేతా అవస్తి)  ఎవరి సపోర్ట్ లేకపోయినా ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తితో  జీవితంలో ఎదగాలని కలలు కంటూ ఉంటుంది.  ఈ క్రమంలో సిద్ధుతో పరిచయం అవ్వడం, అతను వెన్నెలకి ఎలా ఉపయోగపడతాడు ?. అసలు  వీరిద్దరి జర్నీ ఎలా మొదలైంది ? అనుకున్నది సాధించారా ? లేదా ?   చివరకు ప్రేమలో కూడా  ఎలా సక్సెస్ అందుకున్నారు ? అనేదే మిగిలిన సినిమా.

*విశ్లేషణ :   

ఈ సినిమాలో  హీరోగా  నటించిన  దినేష్ తేజ్.. లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా  బాగున్నాడు. ఫెయిల్ అయి ఖాళీగా  తిరిగే ఓ కుర్రాడి పాత్రలో.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో  ఆకట్టుకున్నాడు.   ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో  సాగే కొన్ని  సరదా సన్నివేశాల్లో గాని, అలాగే సెకండాఫ్ లో హీరోయిన్ కి తన ప్రేమను తెలియజేసే  సన్నివేశంలో గాని దినేష్ తేజ  చాలా  బాగా నటించాడు.
అలాగే ఈ సినిమాలో  హీరోయిన్ గా నటించిన  శ్వేతా అవస్తి  కూడా  తన నటనతో  ఆకట్టుకుంది. ప్రేమ  సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన పెర్ఫార్మెన్స్ తో  మెప్పించింది.  మిగిలిన నటీనటులు కూడా  తమ పాత్ర పరిధి మేరకు  బాగానే చేసారు.  దర్శకుడు  పవన్ కుమార్ కె. సక్సెస్ కు  సంబంధించి  మంచి  స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ,
ఆ లైన్ ను  పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను మాత్రం  రాసుకోలేదు. హీరో హీరోయిన్ల  మధ్య  వచ్చే ప్రేమ  తాలూకు సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉండవు.  దీనికి తోడు  కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా  సాగుతాయి.  ఇక సెకండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా  నడుపుదామని దర్శకుడు ప్రయత్నం చేసినా..  ఆ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని  వర్కౌట్ కాలేదు.

*ప్లస్ పాయింట్స్:

స్టోరీ లైన్, నటీనటుల నటన,

*మైనస్ పాయింట్స్ : 
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, ఫేక్ ఎమోషన్స్ తో సాగే సిల్లీ డ్రామా. స్లో నేరేషన్,

*సినిమా చూడాలా  వద్దా ? 

ఒకసారి చూడొచ్చు.  అయితే, ఓటీటీల్లో  ఎన్నో గొప్ప సినిమాలు అందుబాటులో ఉండగా..    ఇలాంటి బిలౌవ్ ఏవరేజ్  సినిమా కోసం థియేటర్ కి వెళ్లి చూడటం వృధానే.  అయితే,  సినిమాలో చెప్పాలనుకున్న  పాయింట్ బాగున్నా.. స్లో నేరేషన్, సింపుల్ ప్లే, సింగిల్ ప్లాట్  కారణంగా  బోరింగ్ డ్రామాగా నిలిచిపోయింది  ఈ సినిమా.

oktelugu.com రేటింగ్ :  2 / 5