Jaggayya: ఆ అలనాటి నటుడు మనల్ని ఆశ్చర్యపరుస్తాడు !

Jaggayya: కొందరు నటులు గురించి కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం. అలనాటి మేటి నటుడు జగ్గయ్య గారు (Jaggayya) కూడా ఆ విషయంలో మనల్ని ఆశ్చర్యపరుస్తారు. మీకు తెలుసా ? జగ్గయ్య గారు తన నటనా ప్రస్థానం ప్రారంభించక ముందు ఓ గొప్ప చిత్రకారుడు. ఆయన ఆ రంగంలో బాగా రాణించారు కూడా. పైగా ప్రముఖ రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు వద్ద జగ్గయ్య గారు శిష్యరికం కూడా చేశారు. అలాగే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి, […]

Written By: admin, Updated On : September 14, 2021 11:39 am
Follow us on

Jaggayya: కొందరు నటులు గురించి కొన్ని విషయాలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం. అలనాటి మేటి నటుడు జగ్గయ్య గారు (Jaggayya) కూడా ఆ విషయంలో మనల్ని ఆశ్చర్యపరుస్తారు. మీకు తెలుసా ? జగ్గయ్య గారు తన నటనా ప్రస్థానం ప్రారంభించక ముందు ఓ గొప్ప చిత్రకారుడు. ఆయన ఆ రంగంలో బాగా రాణించారు కూడా. పైగా ప్రముఖ రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు వద్ద జగ్గయ్య గారు శిష్యరికం కూడా చేశారు.

అలాగే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేసరికి, జగ్గయ్య గారి వయసు పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. కానీ ఆ వయసులోనే జగ్గయ్య గారు రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారు. తెనాలిలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. ఇక జగ్గయ్య గారి గురించి ఎవరికీ తెలియని మరో అంశం.

జగ్గయ్య గారు కొన్నాళ్లు పాటు పత్రికా రంగంలో కూడా ఉన్నారు. దేశాభిమాని పత్రికలో ఆయన విలేఖరిగా కూడా పనిచేయడం విశేషం. ఇక మరొక చిత్రమేంటంటే, మన దేశంలో లోక్ సభకు ఎంపీగా ఎంపికైన మొదటి సినీ నటుడు ఎవరైనా ఉన్నారంటే, అది జగ్గయ్య గారు మాత్రమే.

అన్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించిన గీతాంజలి కావ్యం లోని పద్యాలను జగ్గయ్య గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన రచన కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. పైగా జగ్గయ్య గారు గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తమిళ నటుడు శివాజీ గణేశన్ నటించిన తెలుగు సినిమాలకు సంబంధించి జగ్గయ్య గారే ఆయనకు గాత్రదానం చేసేవారు.

అదే విధంగా జగ్గయ్య గారు ఎన్నో అనువాద సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమా జురాసిక్ పార్కు లో నటుడు రిచర్డ్ అటెన్‌బర్గ్‌కు జగ్గయ్య తెలుగులో అందించిన గాత్రం పలువురి ప్రశంసలు పొందింది. అన్నిటికీ మించి కెరీర్ తొలినాళ్లలో ఆయన హీరోగా కూడా నటించారు.