అమరావతి విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో తప్పటడుగులు వేసిన చంద్రబాబు ఇప్పడు విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ తంటాల్లో ఒకటి కేంద్రం సహకారం కోరడం. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదం అనంతరం వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమరావతి నుంచి రాజధానిని తరలించే అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. కేంద్రం సాయంతో రాజధానిని తరలింపును అడ్డుకోవాలన్న చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Also Read: జగన్ పై గురి పెట్టిన ఎంపీ రఘురామ..!
చంద్రబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించిన మరుసటి రోజే కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో తన వైఖరిని వెల్లడించింది. రాజధాని తరలింపు కేసులో హై కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన కేంద్రం రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని, ఇధి పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అంశమేనని లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పింది. దీంతో చంద్రబాబు ఆశలను కేంద్రం అడియాశలు చేసినట్లయ్యింది. ఇన్నాళ్లు బీజేపీలోని తన వర్గం నాయకులతో రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అమరావతి తరలింపును అడ్డుకుంటుందని ప్రకటనలు చేయించిన చంద్రబాబు వ్యూహం కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ తో బయట పడిందని ఇప్పడు చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: మరో వివాదంలోకి ఎస్వీబీసీ..!
ఇక అమరావతిని తన బ్రాండ్ గా చేసుకున్న చంద్రబాబుకు చివరి న్యాయ పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఇప్పటికే రాజధాని తరలింపు, పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు తదితర అంశాలపై పలువురితో టిడిపి హై కోర్టు, సుప్రీం కోర్టులలో పిటీషన్ లు దాఖలు చేయించింది. న్యాయ పోరాటంతో నైనా అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపును అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం అంత తేలిగ్గా తీసుకోలేదు. న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపునకు న్యాయ పరంగా ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై అన్వేషణపై చర్యలు ప్రభుత్వం చేపట్టింది.