మొత్తానికి ఎఫ్ 3లో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ కాబోతోందని తేలిపోయింది. ఈ సీక్వెల్ లో కూడా తమన్నా, మెహరీన్‌లే కథానాయికలుగా నటించబోతున్నారని.. పాపం వెంకీ వరుణ్ లను వీళ్ళు వదిలేలా లేరని.. మళ్లీ కుమ్మేస్తారని తెలుస్తోంది. అలాగే మరో పాత్రలో సమంతను తీసుకోవాలని అనిల్ ఫిక్స్ అయ్యాడట. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటేనే ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో నెంబర్ వన్ అనిపించుకున్నాడు. అయితే ‘ఎఫ్ 3’ సినిమా ఈ పాటికే బిజీ షెడ్యూల్స్ తో వరుసగా షూటింగ్ జరుపుకుంటూ ఉండాల్సిన ఈ సినిమా.. కరోనా దెబ్బకు మొదలవ్వకుండానే ఆగిపోవాల్సి వచ్చింది. ఇలా ఆగిపోవటం తమకు మంచే చేసిందని అనిల్ చెబుతున్నాడు.
Also Read: అభిమాని కుమార్తె పెళ్ళికి ఆర్ధిక సహాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి
ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ లో కామెడీ మరింతగా పెంచాడట. ఎంతైనా కామెడీని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ ఎవరు అనగానే ముందుగా అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ టాలీవుడ్ లో తన మార్క్ ను క్రియేట్ చేసుకోవడానికి పదేళ్లు కష్టపడ్డాడు. ఏది ఏమైనా తనదైన రైటింగ్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కోసం హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య నుండి కూడా అనిల్ కి కబురు వెళ్ళింది. ఆ మధ్య అనిల్ రావిపూడి బాలయ్యకు “రామారావుగారు” అనే టైటిల్ తో ఒక కథ చెప్పాడు. ఎఫ్ 3 తరువాత బహుశా ఆ సినిమానే అనిల్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరి చూడాలి బాలయ్యతో అనిల్ టైమింగ్ ఎలా ఉంటుందో.
Also Read: తెలుగు హీరోలకు నిరాశ.. ‘కియారా’కి మరో క్రేజీ ఆఫర్ !
ఇక ఎఫ్ 3 విషయానికి వస్తే.. వెంకటేష్, వరుణ్ తేజ్ జనవరి నుండి ఈ సినిమాకి ఫుల్ డేట్స్ కేటాయించారు. ఇప్పటికే నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు ఫుల్ స్క్రిప్ట్ కూడా విన్నారు. స్క్రిప్ట్ వారికి బాగా నచ్చింది కూడా. అందుకే తమ బ్యానర్స్ లో ఇప్పటికే అరడజను సినిమాల పెండింగ్ లతో సతమతమవుతున్నా… ఎఫ్ 3 సినిమాని ఎట్టిపరిస్థితుల్లో జనవరి 22న అధికారకంగా లాంచ్ చేసి వెంటనే షూటింగ్ ను స్టార్ట్ చేసి.. నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేసి.. సమ్మర్ కు ఎఫ్ 3 రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట. అన్నట్లు వెంకీ వరుణ్ ఇద్దరు హీరోలు ఎఫ్ 3 సినిమా పూర్తయ్యేవరకూ తమ డేట్స్ ను కేవలం ఎఫ్ 3 కే కేటాయించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్