Meher Ramesh And Pawan Kalyan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు చాలా కాలం తర్వాత ఓజీ(They Call Him OG) హిట్ తో ఊపిరి పీల్చుకున్నారు. డిప్యూటీ సీఎం అయిపోయాడు,ఇక సినిమాలు చేయడం కష్టం, చేసినా కూడా హాఫ్ బేకెడ్ సినిమాలే వస్తాయి, డేట్స్ కూడా చాలా తక్కువ ఇస్తాడు కాబట్టి, కావాల్సిన ఔట్పుట్ రాదు అని పవన్ వీరాభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. అలాంటి సమయం లో వచ్చిన ‘ఓజీ’ చిత్రాన్ని చూసి అభిమానులు మెంటలెక్కిపోయారు. వరుసగా రీమేక్ సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ నుండి ఈ రేంజ్ క్వాలిటీ సినిమా వస్తుందని కలలో కూడా ఊహించలేదని, సినిమాలోని ప్రతీ ఫ్రేమ్ అభిమానులు రిపీట్స్ లో చూసుకునే విధంగా డైరెక్టర్ ఈ చిత్రాన్ని మలిచాడని సంబరపడ్డారు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తే ఇలాంటి క్వాలిటీ సినిమాలే చెయ్యాలి అని కోరుకున్నారు ఫ్యాన్స్. అలాంటి సమయం లో లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా ఉండబోతుంది అనే వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహం ని నింపింది.
పవన్ కళ్యాణ్ కూడా ట్రాక్ లో పడ్డాడు, తన తోటి స్టార్ హీరోల లాగానే పాన్ ఇండియా మార్కెట్ లో జెండా పాతుతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోపే మరో చేదు వార్త బయటకు వచ్చింది. కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ సినిమాలు కూడా తియ్యని మెహర్ రమేష్ చాలా కాలం నుండి పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక కథ ని వినిపించడానికి తహతహలాడుతున్నాడు అట. కానీ పవన్ మాత్రం కథ వినేందుకు ఛాన్స్ ఇవ్వలేదట. ఎక్కడ మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ ని కలుస్తాడో, ఎక్కడ స్టోరీ వినిపిస్తాడో అని అభిమానులు అరచేతిలో గుండెని పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ కి బంధువు అవుతాడు. ఇండస్ట్రీ లో కొత్తగా వచ్చిన హీరోలు కూడా మెహర్ తో సినిమాలు చేయడానికి భయపడతారు.
అలాంటి టాలెంట్ ఉన్న ఈ డైరెక్టర్ కి మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ‘భోళా శంకర్’ అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ గా నిల్చిందో మనమంతా చూసాము. మెహర్ రమేష్ కి సినిమా ఇచ్చి, అతని నుండి అద్భుతమైన ప్రోడక్ట్ ని ఎలా ఆశిస్తారు?, అతని శక్తి అంతే అని సోషల్ మీడియా లో అభిమానులు అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి నే తప్పుబట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఈ సునామీ వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల అభిప్రాయాలను, ఎమోషన్స్ ని దృష్టిలో పెట్టుకొని మెహర్ రమేష్ సినిమాని రిజెక్ట్ చేస్తాడా?, లేకపోతే మనోడే కదా, ఒక్క అవకాశం ఇద్దామని ఆలోచిస్తాడా?, అసలు ఏమి జరగబోతుంది అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఇది కూడా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమా అట.