Vishwambhara’ Teaser : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ టీజర్ నిన్న దసరా కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ‘భింబిసారా’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది. క్లైమాక్స్ సన్నివేశం తో పాటు, ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. డిసెంబర్ మొదటి వారం లోపు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. జనవరి 10 వ తారీఖున విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేశారు. అయితే నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ లోని VFX షాట్స్ కి నెటిజెన్స్ నుండి ఘోరమైన ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రం అన్నారు, కనీసం ‘భింబిసారా’ రేంజ్ గ్రాఫిక్స్ కూడా లేవు అని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు. ఆగష్టు నెలలో టీజర్ ని కట్ చేశారట, గ్రాఫిక్స్ కూడా కేవలం ఈ టీజర్ కోసం తయారు చేసి విడుదల చేశారట. అప్పటికప్పుడు క్రియేట్ చేసిన VFX షాట్స్ కాబట్టి అలా అనిపించాయని, పూర్తి స్థాయి VFX పనులు మొదలు పెట్టిన తర్వాత మంచి క్వాలిటీ ఉంటుందని, అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు మెగా అభిమానులు. అయితే ట్విట్టర్ ఈ టీజర్ కి నెగటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ బయట ఆడియన్స్ కి మాత్రం బాగా నచ్చిందనే విషయం అర్థం అవుతుంది. 24 గంటలు కూడా గడవకముందే ఈ టీజర్ కి యూట్యూబ్ లో 24 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అందులో 19 మిలియన్ వ్యూస్ మనకి పబ్లిక్ గా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్స్ అన్నిట్లో ‘విశ్వంభర’ టీజర్ కి ఎక్కువ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. టీజర్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి కలిగిన ఫీలింగ్ ఏమిటంటే మంచి స్టోరీ లైన్ ఉందనే విషయం.
అలాగే కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం కొన్ని VFX షాట్స్ ని సరిచేసుకుంటే ట్విట్టర్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాని ‘జగదేక వీరుడు అతి లోక సుందరి’ విడుదలైనటువంటి మే 9వ తారీఖున విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. వాస్తవానికి మార్చి నెలలో విడుదల చేద్దామని ముందుగా ప్లాన్స్ ఉండేవట. కానీ ఆ నెలలో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుండడంతో మే నెలకు వాయిదా వేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. త్వరలోనే అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధం అవుతుంది మూవీ టీం.