Rajinikanth Tollywood Attempt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న వారిలో రజనీకాంత్ ఒకరు కావడం విశేషం… తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు అన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం ఆయన ఇంపాక్ట్ ని చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఆయన అలా సినిమాలు తెలుగులో సైతం డబ్ అయి మంచి విజయాలను సాధించాయి. తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా అతనికి భారీ అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియాలో కూడా అతన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఆయన చేసిన రోబో(Robo), రోబో 2 (Robo 2) సినిమాలు పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. రోబో 2 సినిమా నెగెటివ్ టాక్ వచ్చినప్పటికి 600 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది అంటే రజనీకాంత్ స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు… జైలర్ 2 (Jailer 2) సినిమాతో 500 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టిన ఆయన ఇప్పుడు కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
Also Read: 3 రోజుల్లో 1 లక్ష డాలర్లు..నార్త్ అమెరికాలో ‘హరి హర వీరమల్లు’ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్!
అయితే రజనీకాంత్ తో సినిమా చేయాలని ఒక స్టార్ డైరెక్టర్ తీవ్రంగా ప్రయత్నం చేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న పూరి జగన్నాథ్ రజనీకాంత్ తో తన ఎంటైర్ కెరీర్ లో ఒక సినిమా చేయడానికి తీవ్రమైన సన్నాహాలు చేస్తూ వచ్చాడు.
అయినప్పటికి అది వర్కౌట్ అయితే కాలేదు. ఇక ఆయన రజనీకాంత్ ను కలిసి ఒక కథను కూడా వినిపించారట. కానీ అది రజినీకాంత్ కి పెద్దగా నచ్చకపోవడంతో ఆ కథను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది… ఇక మొత్తానికైతే బుజ్జిగాడు (Bujjigaadu) సినిమాలో రజనీకాంత్ మీద ఉన్న అభిమానంతో హీరో రజనీకాంత్ ఫ్యాన్ గా చేసి ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు.
Also Read: బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్..పాపం చివరికి ఇలాంటి పరిస్థితికి వచ్చేసిందా!
ఇక మొత్తానికైతే రజనీకాంత్ అంటే తనకు విపరీతమైన అభిమానమని పూరి జగన్నాథ్ చాలా సందర్భాల్లో వివరించాడు…మరి ఫ్యూచర్లో అయిన వీళ్ళ ప్రాజెక్టు ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…