Chiranjeevi Srikanth Odela movie: చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ప్రస్తుతం చిరంజీవి – బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఇయర్ ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ చేస్తున్న ‘ప్యారడైజ్’ సినిమా ఆగస్ట్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మూవీ ప్రేక్షకులందరిలో ఒక ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలుగుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించగలిగే కెపాసిటి ఉన్న స్టార్ హీరోలందరు ఉన్నప్పటికి చిరంజీవితో సినిమా చేయడం అనేది ప్రతి ఒక్క దర్శకుడి కల…
అలాగే శ్రీకాంత్ ఓదెల సైతం చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసుకుంటూ పెరిగాడు. చిరంజీవి అంటే చాలా ఇష్టమట. కాబట్టి తనతో సినిమాలు చేయడానికి ఒక మంచి స్టోరీ ని చెప్పాడట. ప్రస్తుతం చిరంజీవి బాబీ తో చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత శ్రీకాంత్ తను చిరంజీవితో చేయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి కథను చెబుతానని తను పలు సందర్భాల్లో చెప్పాడు. ప్రస్తుతం ప్యారడైజ్ రిజల్ట్ మీదనే శ్రీకాంత్ – చిరంజీవి సినిమా ఆధారపడి ఉంటుందని పలువురు సినిమా మేధావులు చెబుతున్నారు.
చిరంజీవి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ఆయన 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోగా ఈ సినిమా కోసం 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈ సంవత్సరం ఇప్పటికే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇక చిరంజీవి కి ఒక మంచి కంటెంట్ తో సినిమా పడితే 500 నుంచి 600 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టగలిగే సత్తా తనకు ఉందని మెగా ఫ్యాన్స్ సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి సైతం 70 సంవత్సరాల వయసులో కూడా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి తన శాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని బట్టి చిరంజీవికి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు…
