మెగాస్టార్ ఒప్పుకోవడం దాదాపు అసాధ్యమే !

మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేమీ కాదు. అలా అని ఆయన రాజకీయాలు తెలిసిన వ్యక్తి కూడా కాదు. వెండితెర రారాజుగా వెలిగిన చిరు, రాజకీయ తెర పై మాత్రం సైడ్ క్యారెక్టర్ కే పరిమితం అయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా చిరు రాజకీయం పై ఓ క్రేజీ రూమర్ తెగ వినిపిస్తోంది. మెగాస్టార్ త్వరలోనే రాజ్యసభకు పంపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందని ఆ రూమర్ సారాంశం. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ […]

Written By: admin, Updated On : June 19, 2021 12:16 pm
Follow us on

మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు కొత్తేమీ కాదు. అలా అని ఆయన రాజకీయాలు తెలిసిన వ్యక్తి కూడా కాదు. వెండితెర రారాజుగా వెలిగిన చిరు, రాజకీయ తెర పై మాత్రం సైడ్ క్యారెక్టర్ కే పరిమితం అయ్యారు. అయితే, గత కొన్ని రోజులుగా చిరు రాజకీయం పై ఓ క్రేజీ రూమర్ తెగ వినిపిస్తోంది. మెగాస్టార్ త్వరలోనే రాజ్యసభకు పంపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందని ఆ రూమర్ సారాంశం.

అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెగాస్టార్ ఇంతవరకు ఎక్కడా డైరెక్ట్ గా సపోర్ట్ చేయలేదు. కేవలం జగన్ ను కలిసి అభినందించారు. అంతమాత్రాన చిరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని, ఆ పార్టీ తరుపున పదవి తీసుకుంటారని మీడియా కథనాలను పుట్టించడం అసత్య ప్రచారమే అవుతుంది. ఒకవేళ ఈ ప్రచారంలో వాస్తవం ఉంది అనుకుందాం, అయినప్పటికీ..

ఈ ప్రతిపాదనకు మెగాస్టార్ ఎలా ఒప్పుకుంటారు ? ఒప్పుకుంటే మెగా కుటుంబంలో చీలిక వచ్చినట్టే కదా ? ఒకపక్క పవర్ స్టార్ రాజకీయాల్లో హిట్ అవ్వడానికి తెగ ఉత్సాహ పడుతున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, జగన్ పార్టీ పదవి అందుకోవడం కుదిరే పని కాదు. పైగా చిరంజీవికి ఆ పదవి వన్నె తెచ్చేది కూడా ఏమి కాదు.

అన్నిటికి మించి మెగాస్టార్ ఇప్పటికే రాజకీయాలపై విసుగెత్తి వేసారి పోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ.. చక్కగా సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ నుండి ప్రమాదం ఉందని భావించిన జగన్, పవన్ రాజకీయాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా కాపు ఓటు బ్యాంక్ ను తన వైపుకు తిప్పుకునే లక్యంగా చిరంజీవిని రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ చిరు ఒప్పుకోవడం దాదాపు అసాధ్యం.