spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha- Chiranjeevi: సమంత ‘వయోసిటీస్’ వ్యాధిపై మెగాస్టార్ మోటివేట్ పోస్టు..: ఫ్యాన్స్ ప్రశంసలు..

Samantha- Chiranjeevi: సమంత ‘వయోసిటీస్’ వ్యాధిపై మెగాస్టార్ మోటివేట్ పోస్టు..: ఫ్యాన్స్ ప్రశంసలు..

Samantha- Chiranjeevi: టాలీవుడ్ బ్యూటీ సమంత ఈమధ్య సినిమాల్లో బీజీగా మారింది. అటు సోషల్ మీడియాలోనూ అప్డేట్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటుంది. అయితే ఒక్కసారిగా.. తాను సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో పెట్టి తనకు ప్రాణాంతక వ్యాధి అనిచెప్పి షాక్ ఇచ్చింది. దీంతో అప్పటి వరకు సమంత అప్డేట్ పోస్టు కోసం చూసిన వారు.. ఇలాంటి పిక్ ను చూసి ఆందోళన చెందారు. ఆమె చెప్పిన విషయంతో అభిమానులే కాకుండా సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ‘గెట్ విల్ సూన్’ పోస్టులు పెడుతున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఆమెకు వచ్చిన వ్యాధిపై మోటివేట్ చేస్తూ ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ వైరల్ కావడంతో అందరూ ప్రశంసిస్తున్నారు.

Samantha- Chiranjeevi
Samantha- Chiranjeevi

‘ఏమాయ చేశావె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత మొదట్లో నార్మల్ గానే కనిపించారు. కానీ ఈ తరువాత తన నట భీభత్సాన్ని చూపించడంతో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చింది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లోనూ సమంతకు బోలెడు అవకాశాలు వచ్చాయి. అటు వెబ్ సిరీసుల్లోనూ సమంత క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఆమెకు వ్యాధి ఉందన్న విషయం అందరినీ కలవరానికి గురి చేసింది.

సినిమాలో ఎంత బిజీ ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సమంత. అయితే ఎప్పుడూ అభిమానులను అలరించే పోస్టులు పెట్టే ఈ బ్యూటీ ఒక్కసారిగా తనకు ‘వయోసిటీస్’ ఉన్నట్లు చెప్పడం షాక్ కు గురి చేసింది. కొద్ది రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని.. అయితే ప్రస్తుతం కోలుకుంటున్నానని సమంత తెలిపింది. సమంత ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా.. సెలైన్ బాటిల్ తో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఆమెకు వృత్తిపై ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనం అని కొందరు కొనియాడుతున్నారు.

Samantha- Chiranjeevi
Samantha- Chiranjeevi

సమంతకు ‘వయోసిటీస్’ అని తెలియడంతో సినీ ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సమంత కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, లావణ్య త్రిపాఠి, హన్సికతో పాటు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. అయితే చిరు అందరిలాగా నార్మల్ పోస్టులు పెట్టలేదు. సమంతను మోటివేట్ చేస్తూ మెసేజ్ పెట్టడం ఆకట్టుకుంది. అందులో ఏముందంటే..?

‘మారుతున్న జీవితంలో అనేక చాలెంజ్ లు వస్తంటాయి. వాటిని స్వాగతించి మనలోని శక్తిని కనిపెట్టి వాటిని అధిగమించాలి. నీలో గొప్ప శక్తి ఉంది. నువ్వు దృఢమైన అమ్మాయివి.. అతి త్వరలో నీకొచ్చిన వ్యాధిని అధిగమిస్తావని అనుకుంటున్నాను. అటుపోట్లన్నీ అధిగమించడం నీకు పెద్ద విషయం కాదు.. అయినా త్వరగా ఈ వ్యాధి నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నా..’ అని మెగాస్టార్ చేసిన మెసేజ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper