https://oktelugu.com/

Chiranjeevi : ‘విశ్వంభర’ ఇంట్రడక్షన్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి లుక్ ని రివీల్ చేసిన మూవీ టీం..కొరియోగ్రాఫర్ ఎవరంటే!

'భోళా శంకర్' వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేస్తున్న చిత్రం 'విశ్వంభర'(Viswambhara Movie). భారీ గ్రాఫిక్స్ కంటెంట్ తో చిరంజీవి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది.

Written By: , Updated On : February 15, 2025 / 05:58 PM IST
Chiranjeevi

Chiranjeevi

Follow us on

Chiranjeevi : ‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేస్తున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). భారీ గ్రాఫిక్స్ కంటెంట్ తో చిరంజీవి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. మన చిన్నతనం లో ఉన్నప్పుడు అంజి చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అవ్వడంతో, చిరంజీవి మళ్ళీ ఆ జానర్ వైపు వెళ్ళలేదు. మళ్ళీ ఇన్ని ఏళ్ళ తర్వాత మంచి కథ దొరకడంతో ‘విశ్వంభర’ ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాలోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్రడక్షన్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం కాసేపటి క్రితమే ఈ సాంగ్ గురించి పోస్ట్ వేస్తూ మెగాస్టార్ నయా లుక్ ని విడుదల చేసింది. ఈ లుక్ లో మెగాస్టార్ అదిరిపోవడం తో అభిమానులు మురిసిపోతున్నారు.

ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా శోభి మాస్టర్(sobhi master) వ్యవహరిస్తున్నాడట. ఈయన ఇది వరకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ అందించాడు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్పులు ఇంస్టాగ్రామ్ లో రీల్స్ రూపంలో బాగా వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కి ఈమధ్య కాలంలో సరైన డ్యాన్స్ నెంబర్ పడలేదు. అలాంటి సమయంలో శోభి మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్ తో ఆయన పని చేస్తుండడంతో కచ్చితంగా ఈ పాట రీసెంట్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కి ది బెస్ట్ గా నిలిచిపోతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తుండగా, త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ హాట్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా., సురభి, ఇషా చావ్లా తదితరులు చిరంజీవి చెల్లెలు పాత్రలు చేస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమాని జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం కోసం వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా జులై నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది విడుదల చేసిన టీజర్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. గ్రాఫిక్స్ చాలా చీప్ గా ఉన్నాయి అనే కామెంట్స్ బలంగా వినిపించాయి. దీంతో మూవీ టీం గ్రాఫిక్స్ పై మరోసారి రీ వర్క్ చేయాల్సి వచ్చింది. సినిమాలో మంచి స్టోరీ ఉన్నట్టుంది కానీ, గ్రాఫిక్స్ కారణంగా ట్రోల్స్ ని ఎదురుకోవాల్సి వస్తుందేమో అని మెగా అభిమానులు భయపడ్డారు. చిరంజీవి కూడా నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకొని మార్పులు చేయాల్సిందిగా మూవీ టీం కి ఆదేశాలు జారీ చేయడంతో, మూవీ టీం ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా హై క్వాలిటీ గ్రాఫిక్స్ కోసం పని చేస్తున్నట్టు సమాచారం.