Godfather Collection Bollywood: రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ మేనియా లో మునిగిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఏ ఇద్దరినీ కదిలించిన గాడ్ ఫాదర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు..ఆ స్థాయి లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రభంజనం నడుస్తుంది..మేజర్ సిటీస్ లో ఈ చిత్రానికి విడుదలై నాలుగు రోజులు అవుతున్నా కూడా టికెట్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది..లిమిటెడ్ రిలీజ్ మీద అతి తక్కువ టికెట్ రేట్స్ తో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే మాములు విషయం కాదు..అది కేవలం మెగాస్టార్ చిరంజీవి కి మాత్రమే సాధ్యం అంటున్నారు ట్రేడ్ పండితులు..ఇప్పటి వరుకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేసేస్తుంది..ఇందులో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ కూడా ముఖ్య పాత్రలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఆయన చేసిన ఆ ముఖ్య పాత్ర బాలీవుడ్ వసూళ్లకు బాగా సహాయపడ్డాయి..మొదటి రోజు అక్కడ ఈ చిత్రానికి రెండు కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా,రెండవ రోజు మరియు మూడవ రోజు కూడా అదే స్థాయి వసూళ్లను రాబట్టింది..రెస్పాన్స్ అదిరిపోవడం తో మూడవ రోజు నుండి ఈ సినిమాకి అదనంగా 3500 కి పైగా షోస్ ని యాడ్ చేశారట..ఈ వీకెండ్ కలెక్షన్స్ అక్కడ దుమ్ము లేచిపోవడం పక్కలాగా అనిపిస్తుంది.

ఈరోజు సాయంత్రం నుండి హిందీ లో ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డు పడిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటి అంటే , ఈ చిత్రానికి ఇప్పటి వరుకు మూడు రోజులకు కలిపి 6 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని తెలుస్తుంది..వీకెండ్ లో సుమారు 20 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం కూడా ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..చూడాలిమరి ఈ సినిమా కూడా పుష్ప , కార్తికేయ 2 లాగ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని లాంగ్ రన్ లో షేక్ చేస్తుందా లేదా అనేది.