Chiranjeevi Bday Special: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సినీ ప్రస్థానం ఒక స్వర్ణ యుగం లాంటిది అనుకోవచ్చు. అప్పటి వరకు ఒకే మూసలో వెళ్ళిపోతున్న తెలుగు కమర్షియల్ సినిమా స్థితి గతులను మార్చిన మహానుభావుడు ఆయన. ఆరోజుల్లో స్టార్ హీరోలు డ్యాన్స్ వేస్తున్నారో, ఫైటింగ్ చేస్తున్నారో అర్థం అవ్వని పరిస్థితి. అలాంటి సమయం లో చిరంజీవి వెండితెర అరంగేట్రం ఇవ్వడం ద్వారా డ్యాన్స్, ఫైట్స్ లో వేగం పెరిగింది. అప్పట్లో చిరంజీవి డ్యాన్స్ ని చూసి ఆడియన్స్ మెంటలెక్కిపోయేవారు. చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి గా చూసే రోజులవి. అప్పటి వరకు సూపర్ స్టార్స్ గా చలామణి అయిన వాళ్ళందరూ చిరంజీవి సునామీ ముందు నిలబడలేకపోయారు. ఆయన లాగా డ్యాన్స్, ఫైట్స్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. అలా ప్రయత్నం చేస్తేనే ఆడియన్స్ ఆదరించేవారు. అలాంటి మేనియా ని సృష్టించాడు మెగాస్టార్.
Also Read: ఆ విషయంలో రజినీకాంత్, కమల్ హాసన్ లను భయపెట్టిన చిరంజీవి…మెగాస్టార్ అంటే మామూలోడు కాదు…
అయితే చిరంజీవి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవ్వడం వల్ల ఆయన నుండి ఎన్నో అద్భుతమైన పాత్రలు ఆడియన్స్ మిస్ అయ్యారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న సమయం లో చిరంజీవి తన కంఫర్ట్ జోన్ ని దాటి, తనలోని పరిపూర్ణమైన నటుడ్ని చూపిస్తూ చేసిన చంటబ్బాయ్, ఆపద్బాంధవుడు, రుద్రవీణ ఇలాంటి సినిమాలు చాలానే చేశాడు. కానీ అవి కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే డ్యాన్స్, ఫైట్స్ చేసే చిరంజీవి నుండి ఆడియన్స్ ఇలాంటివి ఆశించేవారు కాదు. అందుకే తనలోని నటుడికి హద్దులు వేసి కమర్షియల్ సినిమాల వైపే మెగాస్టార్ ఎక్కువగా మొగ్గు చూపించాడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, మాస్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్ని కోణాల్లోనూ ఆడియన్స్ ని అలరించిన ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఆయన లాంటి నటుడు మళ్ళీ రాలేదు, భవిష్యత్తులో రారు కూడా. అందులో ఎలాంటి సందేహం లేదు.
Also Read: వింటేజ్ చిరంజీవిని చూపించిన అనిల్ రావిపూడి…బాస్ ఇస్ బ్యాక్…
కేవలం ఒక నటుడుగా మాత్రమే కాదు, చిరంజీవి ఒక వ్యక్తిగా కూడా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు స్ఫూర్తి దాయకం. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది ఆయన్ని చూసినప్పుడే మనం నేర్చుకోవాలి. చిన్న వాళ్ళ పట్ల ఆదరణ భావం, పెద్ద వాళ్ళ పట్ల అంతులేని గౌరవం ఆయన నుండి నేర్చుకోవాల్సిన అద్భుతమైన లక్షణాలు. అంతే కాదు మనం సంపాదించిన డబ్బులను మనతో పాటు పోయేటప్పుడు తీసుకొని వెళ్లలేము, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నలుగురికి ఎంతో కొంత సహాయం చెయ్యాలి అనే గొప్ప గుణాన్ని కూడా మనం చిరంజీవి నుండి నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం. ఇండస్ట్రీ లో నేడు ఏవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా చిరంజీవి వద్దకు వెళ్తారు. ఆయన ఒక్కసారి రంగం లోకి దిగాడంటే ఎంతటి జటిలమైన సమస్యకి అయినా పరిష్కారం దొరకాల్సిందే. గత 18 రోజులుగా జరుగుతున్నా సినీ కార్మికుల సమ్మె కి కూడా చిరంజీవి చొరవ తీసుకోవడం వల్లనే పరిష్కారం అయ్యింది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి నేడు తన 70 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఆయన ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరో 70 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.