Chiranjeevi Kuberaa Success Meet: చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) రీసెంట్ గా విడుదలైన ‘కుబేర'(Kubera Movie) చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కేవలం కమర్షియల్ గా మాత్రమే కాదు, నటుడిగా కూడా చాలా కాలం తర్వాత నాగార్జున గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది. దీపక్ అనే క్యారక్టర్ ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈ చిత్రం లో ధనుష్(Dhanush) నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తమిళంలో కానీ, ఇటు తెలుగు లో కానీ ఆయన నటనకు తిరుగులేని రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే నాలుగు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్న ధనుష్, ఈ చిత్రం తో ఐదవ నేషనల్ అవార్డుని కూడా అందుకుంటాడని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ఈ సినిమాని చూసిన వాళ్ళందరూ.
Also Read: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున
ఇకపోతే నిన్న ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. చిరంజీవి ఏ ఈవెంట్ కి వచ్చినా మనస్ఫూర్తిగా ఆ సినిమాకు సంబంధించిన వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడడం మనం ఇది వరకే చాలా సార్లు చూసాము. ఇక నిన్న కుబేర సక్సెస్ మీట్ లో అయితే ఆయన తన సొంత సినిమా సక్సెస్ అయినంత ఫీల్ అయ్యాడు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నాగార్జున గురించి మాట్లాడుతూ ‘నాగ్ నాకు ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలిచాడు. అతని కారణంగానే నేను ఫిట్నెస్ విషయంలో ఈరోజు ఇలా ఉన్నాను. నేడు ఆయన తన కెరీర్ పరంగా స్పెషల్ రోల్ చేసి ఒక కొత్త దారిని తన కోసం ఎంచుకొని సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు’.
‘కచ్చితంగా భవిష్యత్తులో నేను కూడా ఆ దారిలో నడుస్తాను. స్పెషల్ రోల్స్ చేస్తాను. ఓటీటీ లలో కూడా అవసరమైతే నటిస్తాను. కచ్చితంగా నాగార్జున కి నేను ఈ దారిలో కూడా పోటీని ఇవ్వగలను అని అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఇది విన్న అభిమానులు మెగాస్టార్ కేవలం ఇది మాట వరుసకు అని ఉంటాడని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి మార్కెట్ నేటి తరం స్టార్ హీరోలకు సమానంగా ఉంది. ఆయన ఒక్కో సినిమా వందల కోట్ల రూపాయిల బిజినెస్ చేస్తూ ఉంటుంది. నాగార్జున కి ప్రస్తుతం అంత బిజినెస్ జరగడం లేదు. ఈమధ్య కాలంలో వరుస ఫ్లాప్స్ కారణంగా ఆయన మార్కెట్ పూర్తిగా దెబ్బతినింది. అందుకే ఆయన క్యారక్టర్ రోల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి కి ఆ అవసరం లేదు. ఒకవేళ ఆయన స్పెషల్ రోల్ చేసినా దానిని ట్రేడ్ మల్టీస్టార్రర్ లాగానే చూస్తుంది అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
