Chiranjeevi Comments On Rashmika: రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న చిత్రం ‘కుబేర'(Kubera Movie). శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) , రష్మిక(Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వడం తో నిన్న హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొని సినిమా గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. నిన్న మొన్నటి వరకు విదేశాల్లో ఆయన అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అక్కడి నుండి తిరిగి రాగానే కుబేర చిత్రాన్ని చూసిన మెగాస్టార్ వెంటనే నాగార్జున కి ఫోన్ చేసి సినిమా గురించి మాట్లాడాడు. అప్పుడు ఆయన ఈ ఈవెంట్ కి ఆహ్వానించడం తో క్షణం కూడా ఆలోచించకుండా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
Also Read: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున
ఈ ఈవెంట్ లో చిరంజీవి హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ ‘నా డైలాగ్ ఇందాకా నువ్వు అనేసావు నాగ్.. నేషనల్ క్రష్ గురించి. కానీ నేను బయటకి అనను, మనసులో అనుకుంటాను. రష్మిక మొదటి సినిమాకు నేనే ముఖ్య అతిథిగా వచ్చాను. ఆరోజు నుండి తనను గమనిస్తుంటే , నటన పరంగా కానీ, తన ఇమేజ్ పరంగా కానీ సినిమా సినిమాకు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. నువ్వు ఎంత అద్భుతంగా నటిస్తావు. నీ కళ్ళు చాలా ఆకర్షణీయమైనవి. నాకు నీ కళ్ళు తప్ప ఏమి కనిపించవు. ఆ కళ్ళతో ఆమె ఈ సినిమాలో ఎన్నో హావభావాలను అద్భుతంగా పలికించింది. ఈ సినిమాలో ఆమె క్యారక్టర్ నిడివి ఎంత ఉంది అనేదానికంటే, ఎంత ఇంటెన్సిటీ ఉందో చెప్పడానికి బాగుంటుంది. ముఖ్యంగా బిడ్డని హోల్డ్ చేసినప్పుడు ఒక కన్నతల్లి లాగా, అమాయకంగా కనిపిస్తూ, తన ప్రియుడు చేత మోసగింపబడినప్పుడు, నాకు చూడాలని ఉంది చిత్రంలో సౌందర్య కనిపించింది. ఆ తర్వాత దేవా క్యారక్టర్ కి సపోర్ట్ గా ఉంటూ ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు అద్భుతం’ అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
అదే విధంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ ‘శేఖర్ కమ్ముల చిత్రం లోని పాత్రలు నిజ జీవితం లో ఇంకా ఎక్కడో జీవిస్తూనే ఉంటాయి అనే విధంగా ఉంటుంది. ఆయన సినిమాల్లోని పాత్రల పేర్లను నేను ఎప్పటికీ మర్చిపోలేను. కుబేర చిత్రం చూసిన తర్వాత నాకు ధనుష్ అనే పేరు కంటే ‘దేవా’ అనే పేరునే ఎక్కువగా గుర్తు ఉంటుంది. అదే విధంగా నా స్నేహితుడు నాగార్జున పేరు కంటే ఇప్పుడు దీపక్ పేరు గుర్తుకొస్తుంది. నా సినిమాలో పాత్రల పేర్లే నాకు గుర్తుండవు, అలాంటిది శేఖర్ కమ్ముల సినిమాలోని పాత్రలు అలాగే గుర్తుండిపోయాయి. అంత అద్భుతంగా ఆయన క్యారెక్టర్స్ రాస్తాడు’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్.
Also Read: నాగార్జున దారిలో నేను కూడా నడుస్తాను..భవిష్యత్తులో స్పెషల్ రోల్స్ చేస్తాను – మెగాస్టార్ చిరంజీవి
