Nagarjuna 100th Film: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) తన 100వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. హీరో గా నాగార్జున పోషించిన పాత్రలు, ఆయన చేసినటువంటి ఎవర్ గ్రీన్ సినిమాలు ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. అక్కినేని అభిమానులు జీవితాంతం గుర్తుయించుకోదగ్గ అద్భుతమైన పాత్రలు ఆయన గతం లో ఎన్నో చేసాడు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి ఈమధ్య కాలం లో హీరో గా సరైన సూపర్ హిట్ పడలేదు. దీంతో కుబేర చిత్రం తో క్యారక్టర్ రోల్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు నాగార్జున. ఈ సినిమా తర్వాత విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ లో విలన్ రోల్ కూడా చేసాడు. ఈ క్యారక్టర్ అక్కినేని ఫ్యాన్స్ ని చాలా తీవ్రంగా బాధపెట్టింది. నాగార్జున తోటి సీనియర్ హీరోలు సోలో గా ఇప్పటికీ 300 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతుంటే, నాగార్జున ఇలా క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడం అసలు నచ్చలేదని సోషల్ మీడియా లో కామెంట్స్ చేశారు.
నాగార్జున కి కచ్చితంగా సోలో హీరో గా భారీ బ్లాక్ బస్టర్ పడాలని, అక్కినేని ఫ్యాన్స్ ఆ సినిమాని ఎప్పటికీ మర్చిపోకూడదని బలంగా కోరుకున్నారు ఫ్యాన్స్. వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ నాగార్జున తన వందవ సినిమాని ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నాడు. రోజు రోజుకి ఈ సినిమా నుండి వస్తున్న అప్డేట్స్ అక్కినేని ఫ్యాన్స్ కి మెంటలెక్కిపోయేలా చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లో టబు, అనుష్క శెట్టి హీరోయిన్స్ గా ఖరారు అయ్యారని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే, ఇందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య మంత్రి గా అతిధి పాత్ర లో కనిపిస్తారని అంటున్నారు. చిరంజీవి , నాగార్జున మధ్య ఎంత గొప్ప సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఒకే తల్లి కడుపున పుట్టకపోయినప్పటికీ, వీళ్లిద్దరు సొంత అన్నదమ్ములు లాగానే ఉంటారు. నాగార్జున నోరు తెరిచి ఏదైనా అడిగితే చిరంజీవి నో చెప్పడం వంటివి జరగదు. అలాంటిది చిన్న అతిథి పాత్ర చేయమంటే మెగాస్టార్ ఒప్పుకోకుండా ఉంటాడా?, సోషల్ మీడియా లో విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన ఈ సమాచారం కచ్చితంగా నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అక్కినేని, మెగా కాంబో ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఆఫ్ స్క్రీన్ లో ఎంతో అన్యోయంగా కనిపించే వీళ్లిద్దరు, ఆన్ స్క్రీన్ పై ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి ఈ చిత్రం తో నాగార్జున అక్కినేని ఫ్యాన్స్ కి మర్చిపోలేని తీపి జ్ఞాపకం అందిస్తాడా లేదా అనేది.