https://oktelugu.com/

Megastar Chiranjeevi: మా ఇంట్లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి క్రేజ్ ఉన్నోళ్లు ఉన్నారు..’పుష్ప 2′ కి గర్విస్తున్నా అంటూ చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

విశ్వక్ సేన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లైలా' వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులను ఎంతో ఉత్సాహ పరిచే ప్రసంగాన్ని అందించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : February 10, 2025 / 08:32 AM IST
    Follow us on

    Megastar Chiranjeevi: విశ్వక్ సేన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లైలా’ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన విడుదల అవ్వబోతున్న సందర్భంగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులను ఎంతో ఉత్సాహ పరిచే ప్రసంగాన్ని అందించాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. విశ్వక్ సేన్ నందమూరి హీరోల అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. నందమూరి హీరోల అభిమాని అయ్యుండి మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథిగా పిలవడం ఏమిటి? అనే చర్చ సోషల్ మీడియా లో బాగా నడిచింది. దీనిపై విశ్వక్ సేన్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. ఇదే అంశం పై మెగాస్టార్ చిరంజీవి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించాడు.

    ఆయన మాట్లాడుతూ ‘నేను ఈరోజు ఇలా విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నాను అని ఒకరితో చెప్తే, ఎందుకు అక్కడికి వెళ్తున్నారు. అతను మన కాంపౌండ్ కాదు, బాలయ్య బాబు కాంపౌండ్ కి సంబంధించినవాడు , అప్పుడప్పుడు తారక్ అభిమాని అంటుంటాడు అన్నారు. దానికి నేను ఎందుకు వెళ్ళకూడదు, ఒకరిపైన అభిమానం చూపిస్తూ, ఇండస్ట్రీ లో నాపైన కూడా ఆప్యాయత చూపించకూడదా?, మా ఇంట్లో కూడా అందరూ ఒకరినే ఇష్టపడరు. నా కొడుకు రామ్ చరణ్ కి హీరో సూర్య అంటే బాగా ఇష్టం. అతన్ని ఇష్టపడుతున్నాడు కదా అని నా కొడుకుని దగ్గర తీయకుండా ఉంటానా?, సినీ ఇండస్ట్రీ లో మేము హీరోలము అయ్యేసరికి మా మధ్య సరిగా సఖ్యత ఉండడమేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి వారు నాకు సోదరులే’ అంటూ చెప్పుకొచ్చాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మాలో ఒకరిపై ఒకరికి అసూయ ఏమి ఉండదు. నాకేమి తక్కువ?, మా కుటుంబానికి ఏమి తక్కువ?, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడు, అదే విధంగా అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ దేశవ్యాప్తంగా రికార్డ్స్ పెట్టడం పై నేను ఎంతో గర్విస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే ఈవెంట్ లో చిరంజీవి ‘జై జనసేన’ అనడం, అప్పటి ప్రజా రాజ్యమే ఇప్పటి జనసేన గా రూపాంతరం చెందింది అంటూ సోభోదించడం నిన్న హాట్ టాపిక్ గా మారిన అంశమైతే, చాలా కాలం తర్వాత చిరంజీవి అల్లు అర్జున్ గురించి ప్రస్తావించడం మరో హాట్ టాపిక్ అయ్యింది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య ఎదో పెద్ద వివాదం నడుస్తుంది అంటూ ప్రచారం చేసిన ప్రతీ ఒక్కరికి ఈ వ్యాఖ్యలు కాస్త స్పీడ్ బ్రేక్ వేసినట్టు అనిపిస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ వస్తాయా లేదా అనేది.