https://oktelugu.com/

CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.

CM Jagan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మెగా అభిమానులు ఈ సినిమా కోసం దాదాపుగా మూడేళ్ళ నుండి ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు , టీజర్ మరియు ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 20, 2022 / 01:27 PM IST
    Follow us on

    CM Jagan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్క ముఖ్య పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మెగా అభిమానులు ఈ సినిమా కోసం దాదాపుగా మూడేళ్ళ నుండి ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఇప్పటి వరుకు ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు , టీజర్ మరియు ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా ఎంతో ఆసక్తిని రేపాయి..ట్రైలర్ ని చూస్తే కొరటాల శివ తన మార్కుని ప్రతి షాట్ లో ఉండేట్టు చూసుకున్నాడు..ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 23 వ తారీఖున ఘనంగా జరగనుంది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ తో పాటు టాలీవుడ్ కి చెందిన అతిరధ మహారధులు ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు.

    Chiranjeevi, Jagan

    ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ గారిని మెగాస్టార్ చిరంజీవి ఆహ్వానించారు అంటూ ఒక్క వార్త వచ్చిన సంగతి మన మన అందరికి తెలిసిందే..అయితే ఈ వార్తలు ఎలాంటి నిజం లేదు అని ,జగన్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావట్లేదు అంటూ మెగాస్టార్ సన్నిహిత వర్గాలు కొట్టిపారేశాయి..అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే చిరంజీవి గారు జగన్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానించేందుకు ప్రభుత్వానికి చెందిన ముఖ్య నేతలతో చర్చించాడు అని..కానీ వారు సీఎం గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలి అంటే కొన్ని షరతులు పెట్టారు అని..ఆ షరతులకు చిరంజీవి గారు ఒప్పుకోలేదు కాబట్టే విజయవాడ లో జరగాల్సిన ఈ ప్రీ రిలీజ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

    Also Read: Bigg Boss Telugu OTT: స్ర‌వంతిని వాడుకున్నావ్.. శివ‌పై బింధుమాధ‌వి ఫైర్‌.. అత‌ని వెన‌కాల ప‌డలేద‌న్న అషురెడ్డి..

    ఇంతకీ ఆ ప్రభుత్వ సలహాదారుడు పెట్టిన షరతులు ఏమిటి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కేవలం లిమిటెడ్ పాసులు మాత్రమే ఇవ్వాలి అని..అది కూడా కేవలం మెగా ఫాన్స్ కి మాత్రమే ఇవ్వాలి అని , జనసేన పార్టీ వాళ్లకి ఇవ్వకూడదు అని ఒక్క షరతు పెట్టారు అట..మరో షరతు ఏమిటి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణం లో 144 సెక్షన్ ని విధిస్తాము అని..ఇందుకు ఓకే అంటేనే ముఖ్యమంత్రి గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అవుతారు అని చెప్పడం తో చిరంజీవి గారు అందుకు ఒప్పుకోలేదు అంట..

    అంతే కాకుండా సీఎం జగన్ ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నాడు అనే వార్త రావడం తో సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి చిరంజీవి మీద విపరీతమైన నెగటివ్ కామెంట్స్ రావడం తో సీఎం ని పిలిస్తే వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ ఉండేట్టు ఉంది అని ఆ ఆలోచన విరమించుకున్నట్టు సమాచారం..అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు హాజరు అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో సాగుతున్న చర్చ?? అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు SS రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అని తెలుస్తుంది..మరి ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ చూడాలి.

    Also Read: Naga Chaitanya- Sai Pallavi: చైతు ప్లాట్ లో అడ్డంగా దొరికిన ‘సాయి పల్లవి’

    Recommended Videos:

    Tags