Megastar Chiranjeevi: తెలుగు ప్రజల అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవికి కోపమొచ్చింది. సాధారణంగా సున్నిత మనస్కుడైన చిరంజీవికి కోపం రావడం అరుదు. కానీ ఆదివారం హైదరాబాద్‌లో బాలీవుడ్ స్టార్ నటిస్తున్న లాల్‌సింగ్ చద్దా సినిమాపై అమీర్‌ఖాన్‌తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను మెగాస్టార్ సమర్పిస్తున్నారు. ఆగస్టు 11న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా ప్రమోషన్ వర్క్‌లో భాగంగగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లలో తెలుగు సినిమా దర్శకులను సున్నితంగా మందలించారు. తాజాగా తెలుగు సినిమాలు తీస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
డైరెక్టర్లకు సున్నిత హెచ్చరిక..
తెలుగు సినిమాలవైపు ఇప్పుడు భారత దేశం చూస్తోంది. ప్యానిండియా సినిమాలతో తెలుగు దర్శకులు కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి కోపం రావడం.. దర్శకులను సున్నితంగా హెచ్చరించడం చూస్తుంటే ఆయన బాగా నొచ్చుకుని ఉంటారన్న అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది. ‘తెలుగు దర్శకులు ఇన్‌స్టంట్‌గా సినిమాలు తీస్తున్నారని, అవార్డులు వచ్చేలా, తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చేలా పనిచేయడం లేదు. ఇన్‌స్టంట్ కథలు, ఇన్‌స్టంట్ డైలాగులతో ఎలాంటి వర్క్ చేయకుండాలనే షూటింగ్‌లు చేస్తున్నారు. ఇన్‌స్టంట్ టిఫిన్, ఇన్‌స్టంట్ భోజనం తినడానికి బాగుంటాయి. ఇన్‌స్టటంట్ సినిమాలు చూడడానికి బాగుండవు. దర్శకులు కథను ఫ్రీజ్ చేసి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సినిమాకు కథనే హీరో కావాలి. ప్రస్తుత దర్శకులు నటీనటుల ఆధారంగా కథ రాస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల సందర్భంగా ఏ దర్శకుని పేరు ప్రస్తావించకపోయినా ఆయన ఆవేదన అంతా ఇండస్ట్రీకి గుర్తింపు రావాలి అన్నదే అని అర్థమవుతోంది.
సినిమాలపై ఎప్పటి నుంచో విమర్శలు..
తెలుగు సినిమాలపై చాలాకాలంగా విమర్శలు ఉన్నాయి. కథను చంపస్తున్నారని, హీరో ఆధారంగా కథలు వస్తున్నాయన్నన అభిప్రాయం ఉంది. రాజమౌలి మాత్రమే కథ ఆధారంంగా సినిమా తీస్తారని అందుకే సక్సెస్ అవుతున్నారని చాలామంది పేర్కొంటారు. కథపై నెలల తరబడి వర ్కవుట్ చేస్తారని, çషూటింగ్ ఆలస్యం చేస్తారన్న విమర్శలు ఉన్నా రాజమౌళి తన పని తాను చేసుకుంటూ పోతారు. దీంతో విజయం ఆయనను వరిస్తోంది అన్న అభిప్రాయం ఉంది. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా వర్కవుట్ ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఇప్పటికైనా దర్శకులు మారుతారో లేదో చూడాలి.
Also Read:Rajinikanth Income Tax Award: రజినీకాంత్ – అక్షయ్ కు అవార్డ్స్.. మరి తెలుగు హీరోల పరిస్థితి ఏమిటి ?