https://oktelugu.com/

Chiru Celebrates kaikala Satya Narayana 86 Birthday: బెడ్ పై ఉన్న కైకాల సత్యనారాయణ చేత చిరు ఏం చేయించారో తెలుసా ?

Chiru Celebrates kaikala Satya Narayana 86 Birthday: నవరస నట సార్వభౌమ ‘కైకాల సత్యనారాయణ’ తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా ఎదిగారు కైకాల. అందుకే, తెలుగు సినిమా చరిత్రలో లిఖించబడే అరుదైన మహా నటులలో కైకాల కూడా ఒకరు. నవరసాల నటచక్రవర్తిగా కైకాల, తానూ నటించిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మేటి నటుడు. ప్రస్తుతం కైకాల ప్రస్తుతం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 05:47 PM IST

    Chiru Celebrates kaikala Satya Narayana 86 Birthday

    Follow us on

    Chiru Celebrates kaikala Satya Narayana 86 Birthday: నవరస నట సార్వభౌమ ‘కైకాల సత్యనారాయణ’ తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్ళ‌కు పుట్టారు. తెలుగు సినిమాతో స‌మాంత‌రంగా ఎదిగారు కైకాల. అందుకే, తెలుగు సినిమా చరిత్రలో లిఖించబడే అరుదైన మహా నటులలో కైకాల కూడా ఒకరు. నవరసాల నటచక్రవర్తిగా కైకాల, తానూ నటించిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మేటి నటుడు.

    Chiru, Kaikala Satya Narayana

    ప్రస్తుతం కైకాల ప్రస్తుతం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యి చికిత్స తీసుకుంటున్నారు. అయితే, నేడు ఆ నటసార్వభౌమ నవరసాల నట చక్రవర్తి పుట్టినరోజు. కైకాల జన్మదినం కావడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

    పైగా చిరు ఎంతో ప్రేమగా కైకాల చేత కేక్ కూడా కట్ చేయించారు. కైకాల – మెగాస్టార్ కలిసి ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా మంచి మనసు ఉన్నవాడు చిరంజీవి. అందుకే, ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో కైకాల గారు కూడా ఇదే విషయం చెప్పారు.

    Chiru Celebrates Kaikala Birthday

    చిరంజీవి గురించి కైకాల మాటల్లోనే.. ‘మంచి సుగుణాలన్నీ ఉన్న వ్యక్తి చిరంజీవి. ఒక నటుడిగా మెగాస్టార్‌ అనిపించుకున్నాడు. ఆ దేవుడు చిరంజీవిని ఎప్పుడు కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ కైకాల సత్యనారాయణ చెప్పుకొచ్చారు. 1935 జూలై 25న స‌త్య‌నారాయ‌ణ జ‌న్మించారు. అది 1950 నాటి కాలం, ఎన్టీఆర్ లా ఉన్నావ్ అని అందరూ అంటుంటే.. కైకాల ఎలాగైనా తాను నటుడు అవ్వాలని మద్రాసు పయనం అయిన రోజులు అవి.

    Chiru Celebrates kaikala Satya Narayana 86 Birthday

    మద్రాసు వచ్చిన తరువాత తినడానికి కూడా తిండి లేక, మరోపక్క సినిమాల్లో అవకాశాలు దొరక్క, కైకాల చాలా ఇబ్బందలు పడ్డారు. అలా ఎన్నో కష్టాలు పడ్డాక, 1959లో ఆయ‌న న‌టించిన చిత్రం సిపాయి కూతురు విడుద‌ల‌యింది. ఇక అప్పటి నుంచి అవకాశాలు వచ్చాయి, తెలుగు వెండితెరకు మరో నిండైన నటుడు దొరికాడు. ఎన్నో చిత్రాల్లో ఎన్నెన్నో పాత్రల్లో స‌త్య‌నారాయ‌ణ జీవించారు. ఆయనకు మా ఓకే తెలుగు తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

    Tags