spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi New Movie Update: మెగా అభిమానులకు పండగ లాంటి వార్త.. ఈ నెల...

Megastar Chiranjeevi New Movie Update: మెగా అభిమానులకు పండగ లాంటి వార్త.. ఈ నెల 11న ఊహించని సర్ప్రైజ్..

Megastar Chiranjeevi New Movie Update: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఎంతటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఈ సినిమా సాధించిన వసూళ్లు మెగా ఫ్యాన్స్ కి ఒక తీపి జ్ఞాపకం లాంటిది. దాదాపుగా 302 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి నెలాఖరులో ఈ సినిమా మొదలు కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల బాగా ఆలస్యం అయ్యింది. చిరంజీవి కి మోకాళ్ళ సర్జరీ జరగడం , ఆ తర్వాత ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కొంత కాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.

అంతే కాకుండా ఆ చిత్ర నిర్మాత ‘జన నాయగన్ ‘ విడుదల సమస్యల్లో పడిపోవడం వల్ల , ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వచ్చింది. అది కూడా ఈ చిత్రం ఇన్ని రోజులు మొదలు కాకపోవడానికి కారణం అయ్యింది. అయితే ఇప్పుడు ఆ సమయాలని తొలగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు సినిమాకు తగ్గట్టు మారడానికి వర్కౌట్స్ మొదలు పెట్టేసాడు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే , ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెల 11 న మొదలు కాబోతున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 20 నుండి రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారట. అందుకోసం డైరెక్టర్ బాబీ ప్రస్తుతం లొకేషన్ హంటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో నటించే నటీనటులు కూడా ఖరారు అయిపోయారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అనురాగ్ కశ్యప్ ఈ చిత్రం లో విలన్ గా నటిస్తుండగా, అనశ్వర రాజన్ ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కి కూతురిగా నటించబోతుంది. హీరోయిన్ గా ఇప్పటికే ఐశ్వర్య రాయ్ ఫిక్స్ అయిపోయింది. ఇలా భారీ క్యాస్టింగ్ ని రెడీ చేసాడు డైరెక్టర్. అదే విధంగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘గాడ్ ఫాదర్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో తమన్ అందించిన మ్యూజిక్ ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మళ్లీ వీళ్లిద్దరు కలిసి ఇన్నాళ్లకు పని చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి ఓల్డ్ ఏజ్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో కేవలం అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular