IPL 2026 OG Mania: IPL సీజన్ మొదలైంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సీజన్ గురించి అప్డేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రెండు మ్యాచులు ఆడగా , ఒక్క మ్యాచ్ గెలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ లో SRH టీం హై స్కోర్ చేయడం అభిమానులకు ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఇక మిగిలిన టీమ్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ , ముంబై ఇండియన్స్ , ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పుంజాబ్స్ కింగ్స్ వంటి టీమ్స్ చెరో మ్యాచ్ గెలిచారు. నేడు చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచి బోణీ కొట్టబోతుందా , లేకపోతే పంజాబ్ కింగ్స్ రెండవ మ్యాచ్ కూడా గెలవనుందా అనేది చూడాలి.
అయితే ఏ టీం అభిమాని అయినా, తమ టీం కి ఎలివేషన్ ఇవ్వడం కోసం ఒక పాపులర్ మూవీ లోని సన్నివేశాలకు సంబంధించిన వీడియో లను , లేదా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుకుంటూ వీడియోస్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియా లో ప్రముఖ మీమర్స్ అప్లోడ్ చేసే విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఈ సీజన్ లో మీమర్స్ కి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా ఒక వరం లాగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , అదే విధంగా సినిమాలోని కొన్ని ఐకానిక్ షాట్స్ ని మీమర్స్ ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. ముఖ్యంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గెలవగానే ఇన్ స్టాగ్రామ్ లో మీమర్స్ ఒక రేంజ్ లో ఓజీ సినిమాలోని సన్నివేశాలను వాడుతూ , SRH టీం కి ఎలివేషన్స్ వేశారు. కేవలం ఈ ఒక్క టీం అభిమానులు మాత్రమే కాదు, ఇతర టీం అభిమానులు కూడా ఓజీ మూవీ లోని సన్నివేశాలనే వాడుతున్నారు.
ఒకప్పుడు యూత్ మొత్తం ఇలా సలార్ మూవీ ని వాడుకునేవారు. ఇప్పుడు వాళ్లకు ‘ఓజీ’ చిత్రం సరికొత్త ఎమోషన్ గా మారిపోయింది. జియో సావన్ లో కూడా ప్రతీ రోజు ఓజీ OST ని వాడుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంది. దీనిని బట్టీ జెన్ జీ ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం ఏ రేంజ్ లో కనక్ట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ అంత తేలికగా మంచి సినిమాలు ఇవ్వడు , ఒకవేళ ఇస్తే ఒక జనరేషన్ మొత్తాన్ని తనతో పాటు తీసుకెళ్తాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.
