Chiranjeevi: బిగ్ బ్రేకింగ్: సరికొత్త న్యూస్ ఛానల్ ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి..అభిమానుల కల ఎట్టకేలకు నిజమైంది!

జనాలు వీక్షించే టాప్ రేటింగ్స్ ఉన్న టీవీ చానెల్స్ మొత్తం టీడీపీ, వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే మెగా కుటుంబానికి అనుకూలంగా లేటెస్ట్ గా మరో ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ పేరు 'మెగా 9'. నేడు మెగాస్టార్ చిరంజీవి ఈ ఛానల్ ని ప్రారంభించాడు.

Written By: Vicky, Updated On : October 15, 2024 2:51 pm

Chiranjeevi(18)

Follow us on

Chiranjeevi: నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం ఉన్నప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన మీడియా చానెల్స్ లేవు అంటూ అభిమానుల నుండి కంప్లైంట్స్ వచ్చేవి. ముఖ్యంగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ కి అనుకూలంగా ఒక్క మీడియా ఛానల్ కూడా లేకపోవడం గమనార్హం. దాని వల్ల ప్రజారాజ్యం పార్టీ పై పలు మీడియా చానెల్స్ విషం కక్కుతూ అసత్య ప్రచారాలను చాలా తేలికగా చేయగలిగాయి. ఆ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలలో ఒకటి అనుకూల మీడియా లేకపోవడం. అలాగే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. మీడియా చానెల్స్ ఉద్దేశపూర్వకంగా జనసేన పార్టీ గుర్తుని జనాల్లోకి వెళ్లనివ్వకుండా చేసింది. ఇప్పుడు కొన్ని చానెల్స్ జనసేన కి అనుకూలంగా ఉన్నాయి కానీ, అవి అంతగా ప్రాచుర్యంలో లేనివి గా చెప్పొచ్చు.

జనాలు వీక్షించే టాప్ రేటింగ్స్ ఉన్న టీవీ చానెల్స్ మొత్తం టీడీపీ, వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే మెగా కుటుంబానికి అనుకూలంగా లేటెస్ట్ గా మరో ఛానల్ వచ్చింది. ఆ ఛానల్ పేరు ‘మెగా 9’. నేడు మెగాస్టార్ చిరంజీవి ఈ ఛానల్ ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో కాసేపటి క్రితమే విడుదలైంది. చిరంజీవి కి అత్యంత ఆప్తుడైన కమలాకర్ ఈ ఛానల్ కి ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆయన కొడుకు అభినవ్ ఈ ఛానల్ కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం డిజైన్ చేసాడు. ఆయనే ఈ ఛానల్ కి మ్యానేజింగ్ డైరెక్టర్ కూడా. అలాగే చిరంజీవి కి సోదర సమానుడైన మధు, కిరణ్ వంటి వారు కూడా ఈ ఛానల్ లో భాగస్వాములు గా నిలిచారు. చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉండడంతో ఛానల్ పేరు ని కూడా ‘మెగా 9’ అని పెట్టుకున్నారు. లైవ్ న్యూస్ తో పాటుగా, డిబేట్స్ పొలిటికల్ న్యూస్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, సినిమా న్యూస్ ఈ ఛానల్ లో రన్ అవ్వబోతున్నాయట. అంతే కాకుండా ప్రతీ రోజు దేశం లో బర్నింగ్ సమస్యలుగా ఉన్నటువంటి వాటిపై ప్రత్యేక ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది.

ఏడాది లోపు ఈ ఛానల్ ని టాప్ 10 న్యూస్ చానెల్స్ లో ఒకటిగా నిలిపే దిశగా టార్గెట్ ని పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ని కలిసి, ఆయన ఆశీర్వాదం తీసుకొని, ఈ ఛానల్ ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. చిరంజీవి ఈ సందర్భంగా చైర్మన్ కమలాకర్ కి, మ్యానేజింగ్ డైరెక్టర్ అభినవ్ కి శుభాకాంక్షలు తెలియచేసాడు. మరి ఈ ఛానల్ అనుకున్న లక్ష్యానికి చేరుకుంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ టీఆర్ఫీ రేటింగ్స్ విషయంలో టాప్ 10 లోకి వస్తే జనసేన పార్టీ కి ఎన్నికల సమయంలో బాగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, చూడాలి మరి ఈ ఛానల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.