Devara: దసరా సినిమాలు ఢీలా పడిపోవడం దేవర సినిమాకి ప్లస్ అయిందా..? నిజంగా ఈ మూవీకి అన్ని వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయా..?

సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా కూడా సక్సెస్ టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్లను సాధించాలని ప్రొడ్యూసర్లు కోరుకుంటుంటారు. నిజానికైతే ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధించి ఆ హీరోకి ఆ దర్శకుడికి, ప్రొడ్యూసర్ కి మంచి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశ్యం తోనే వాళ్ళు సినిమాలను చేస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 15, 2024 2:45 pm

Devara Movie collections

Follow us on

Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు…ఇక పాన్ ఇండియాలో కూడా ఈయనకు భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ లో మంచి సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అవతారం ఎత్తిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో సోలోగా తన సత్తా ఏంటో చూపించుకోవడానికి రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా మొదట కొంతవరకు నెగటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఆ తర్వాత మెల్లిగా కలెక్షన్లు అయితే పెరుగుతూ వచ్చాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిందంటూ ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇదంతా చూసిన సినీ పండితులు సైతం సినిమా యావరేజ్ ట్రాక్ తెచ్చుకున్నప్పటికీ 500 కోట్ల కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అంటూ వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమాకి అన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయా లేదంటే ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఫేక్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక దానికి తోడుగా దసరా కి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకుడిని అంతగా మెప్పించకపోవడం దేవర సినిమాకి ప్లస్ అయింది. ఇక ఇప్పుడు దేవర సినిమా కలెక్షన్స్ కూడా స్టడీగా ఉండి పడిపోకుండా ముందుకు సాగుతున్నాయి. దానివల్ల దేవర సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుంది.

ఇక రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘వేట్టయన్’ సినిమా ఒకటే ఈ సంక్రాంతికి వచ్చిన భారీ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో చాలా వరకు నిరాశపరిచింది. ఇక దానివల్ల దేవర సినిమాకి హైప్ అయితే మరింత పెరుగుతూ వస్తుంది. మొత్తానికైతే ఈ సినిమా లాంగ్ రామ్ లో ఇంకా భారీ కలెక్షన్లను సాధిస్తుంది అంటూ నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…

ఇక ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ యాంటి ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ నానా ప్రచారాలు చేస్తున్నారు. మరి ఇవి నిజంగా వచ్చిన కలెక్షన్స్ ఏనా లేదా ఫేక్ కలెక్షన్స్ ఆ అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటూ సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…