https://oktelugu.com/

KTR – Adipurush: బీజేపీకి మైలేజ్ తెచ్చేందుకే ప్రభాస్ ‘ఆదిపురుష్’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR – Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దీనిపై రాజకీయ కామెంట్లు రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ ఎక్కడ కూడా రాజకీయాల్లో తలదూర్చకపోయినా ఆయన పేరును ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుకుంటున్నారు. ఫలితంగా ఆదిపురుష్ కు రాజకీయ రంగు పులుముతున్నారు. దీంతో ప్రేక్షకులు బాధ పడుతున్నారు. ఆదిపురుష్ పై తెలంగాణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 26, 2022 / 11:27 AM IST
    Follow us on

    KTR – Adipurush: ప్రభాస్ హీరోగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో దీనిపై రాజకీయ కామెంట్లు రావడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్ ఎక్కడ కూడా రాజకీయాల్లో తలదూర్చకపోయినా ఆయన పేరును ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుకుంటున్నారు. ఫలితంగా ఆదిపురుష్ కు రాజకీయ రంగు పులుముతున్నారు. దీంతో ప్రేక్షకులు బాధ పడుతున్నారు.

    KTR – Adipurush

    ఆదిపురుష్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అభిమానుల్లో గందరగోళం ఏర్పడుతోంది. బీజేపీ దేశంలో భక్తి సినిమాల ద్వారా హిందుత్వాన్ని ప్రజల్లోకి చొప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగా 16 సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలు రచించిందని పేర్కొనడం వివాదాలకు కేంద్రంగా మారింది. దీంతో బీజేపీ కనుసన్నల్లోనే ప్రభాస్ నటిస్తున్నారని కేటీఆర్ చెప్పడం గమనార్హం.

    Also Read: Revanth Reddy- Drugs Case: డ్రగ్స్ కేసును వదలని రేవంత్.. చిక్కుల్లో టాలీవుడ్ సినీ ప్రముఖులు

    దీంతో ఏ పాపం ఎరగని ప్రభాస్ సైతం బీజేపీ మాయలో పడ్డారని కేటీఆర్ కామెంట్ చేయడం అభిమానులకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఆదిఫురుష్ లో రాముడి పాత్రలో కనిపించే ప్రభాస్ పై ఇన్ని రకాల కామెంట్లు చేయడం కేటీఆర్ కు తగదని హితవు పలుకుతున్నారు. రామాయణం కథ ఆధారంగా నిర్మించే సినిమాలో రాజకీయాలకు తావు ఎందుకు ఉంటుందని సగలు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

    KTR – Adipurush

     

    దేశభక్తితో సినిమాలు రూపొందిస్తున్నా కేటీఆర్ కు ఎక్కడ రాజకీయం కనిపించిందో అర్థం కావడం లేదు. కానీ ఇంతవరకు చిత్ర యూనిట్ మాత్రం ఏ రకమైన స్పందన కనబరచలేదు. ప్రభాస్ కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై ఎలాంటి మూమెంట్ తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కేటీఆర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక సినిమాను ఆధారంగా చేసుకుని కేటీఆర్ ఉచిత సలహాలు ఇవ్వడంతో యావత్ ప్రేక్షక లోకం నివ్వెరపోతోంది. కేటీఆర్ కు మతిభ్రమించిందా అనే కోణంలో కూడా అభిమానులు కామెంట్లు పెట్టడం విశేషం.

    ఇప్పటికే బీజేపీ రెండు సినిమాలు విడుదల చేసిందని ఇప్పుడు ఇంకా కొన్ని సినిమాలు నిర్మించి ప్రజల మెదడును మరల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. సర్కారు తీరుకు అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ మనసులో ఏదో పెట్టుకుని బీజేపీని సాధించాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో కూడా తెలియడం లేదు.

    Also Read:IPL 2022: కోట్లు కుమ్మ‌రిస్తే.. భారంగా మారుతారా.. ఈ ఆట‌గాళ్ల‌ను త‌ప్పించేసిన టీమ్‌లు..!
    Recommended Videos


    Tags