Vishvambhara movie : ఒక సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషనల్ కంటెంట్ అత్యంత అవసరం. ఈ కంటెంట్ మీదనే సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటుంది. రీసెంట్ గా విడుదలైన విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఒక ఉదాహరణ. ఈ చిత్రం లోని పాటలు, టీజర్, ట్రైలర్ ప్రతీ ఒక్కటి సెన్సేషన్ అయ్యాయి. ఫలితంగా సినిమా ఒక రేంజ్ లో లేకపోయినా, కమర్షియల్ గా కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ, భవిష్యత్తులో స్టార్ హీరోల సినిమాలకు అయినా ఇంతటి వసూళ్లు సాధ్యమేనా? అనే తరహాలో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది ఈ చిత్రం. ప్రీ రిలీజ్ కంటెంట్ పాజిటివ్ గా ఉండడం వల్ల ఒక సినిమా ఫలితం ఇలా తయారైంది. అంతే కాకుండా ఒక సినిమాకి విడుదలకు ముందు నెగటివ్ ప్రీ రిలీజ్ కంటెంట్ ఉంటే ఓపెనింగ్స్ దారుణంగా దెబ్బతింటున్నాయి. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రం చేరనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
ఈ సినిమా టీజర్ విడుదలకు ముందు హైప్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. మెగాస్టార్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోయే చిత్రం అవుతుందని అభిమానులు బలమైన నమ్మకం పెట్టుకున్నారు. కానీ టీజర్ విడుదల తర్వాత ‘ఇవేమి అమీర్ పెట్ గ్రాఫిక్స్ బాబూ..?, నిర్మాత దగ్గర డబ్బులు లేవా?, సంతూర్ యాడ్స్ లో ఉండే షాట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఇందులో పెట్టారేంటి?’ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి దారుణమైన ట్రోల్స్ ని చూడాల్సి వచ్చింది ఈ టీజర్. ప్రేక్షకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని మెగాస్టార్ చిరంజీవి చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్క్ పై ఆయన ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ బడ్జెట్ విషయం లో వెనకాడుతున్నారట. హై క్వాలిటీ గ్రాఫిక్స్ అవసరమయ్యే షాట్స్ కి 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ఖర్చు చేయాల్సి ఉంటే, కేవలం కోటి రూపాయిలు మాత్రమే ఇస్తున్నారట.
అందుకే గ్రాఫిక్స్ అనుకున్న స్థాయి క్వాలిటీ లో లేవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. చిరంజీవి కూడా బడ్జెట్ పెట్టుకోలేనప్పుడు ఇంత భారీ బడ్జెట్ గ్రాఫిక్స్ ఉన్నటువంటి సబ్జెక్టు ని ఎందుకు ఎంచుకున్నారు?, నేను కోరిన విధంగా గ్రాఫిక్స్ కంటెంట్ రాకపోతే అసలు నేను ఈ సినిమాని పూర్తి చేయను, డబ్బింగ్ కూడా చెప్పను అని చిరంజీవి చాలా ఫైర్ అయ్యాడట. దీంతో మేకర్స్ దిగొచ్చి, ప్రస్తుతం తాము పూర్తి స్థాయిలో అప్పుల్లో మునిగిపోయామని, దయచేసి మాకు సహనిర్మాతగా ఒక పెద్ద నిర్మాణ సంస్థ దొరికితే కచ్చితంగా మీరు కోరిన విధంగా ఔట్పుట్ రప్పిస్తామని చెప్పుకొచ్చారట. దీంతో చిరంజీవి ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ తో మాట్లాడి, కల్కి సినిమాకి ఎక్కడైతే VFX చేసారో, ఆ కంపెనీ లోనే విశ్వంభర VFX ని చేయించాలని కోరాడట. చిరంజీవి చెప్పడం తో ఆయన వెంటనే అంగీకారం తెలిపేది. ఈ VFX వర్క్ మొత్తాన్ని కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.