Chiranjeevi Comments On Nagarjuna: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి , అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కి ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగార్జున ఎప్పుడు తన సినిమా సక్సెస్ అయినా మెగాస్టార్ చిరంజీవి తనతో పాటు ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాడు. గతంలో నాగార్జున హీరో గా నటించిన ‘వైల్డ్ డాగ్’ సమయంలో కూడా చిరంజీవి ప్రత్యేకంగా నాగ్ తో కలిసి ప్రెస్ మీట్ ని నిర్వహించి ఆ సినిమా ఎంత గొప్పగా ఉందో, తనకు ఎంత బాగా నచ్చిందో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ‘కుబేర'(Kubera Movie) చిత్రం సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. నిన్న హైదరాబాద్ లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ఈ సక్సెస్ ఈవెంట్ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో కుబేర టీం లో పని చేసిన ప్రతీ ఒక్కరు ఈ ఈవెంట్ లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు.
Also Read: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఉన్నవాళ్లు మొత్తం నా శ్రేయోభిలాషులు అవ్వడంతో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నా సక్సెస్ ఈవెంట్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా మొదలయ్యే ముందు నాగార్జున ని నేను కలిసినప్పుడు అడిగాను, ఏంటి నాగ్, తర్వాత ఏమి చేయబోతున్నావు, శేఖర్ కమ్ముల సినిమా అని విన్నాను అని అడిగాను. ఒక మంచి క్యారక్టర్ దొరికింది, ధనుష్ లీడ్ రోల్ చేస్తున్నాడు అని అన్నాడు. అదేంటి నాగ్, ఎలా ఒప్పుకున్నావ్ ఈ క్యారక్టర్ అని అడిగాను. తెలీదు అండీ, హీరో పాత్రలు చేసి బాగా బోర్ కొట్టేసింది, నాకు ఎందుకో కాస్త డిఫరెంట్ గా చెయ్యాలని ఉంది, కొత్త యాంగిల్ కి గేట్లు ఓపెన్ చెయ్యాలని అనిపిస్తుంది. ఈ సినిమా నాకు అందుకు ఉపయోగపడుతుందని అనిపిస్తుంది అని చెప్పాడు. ఈ సినిమా చూసిన తర్వాత అది నూటికి నూరు శాతం కరెక్ట్, తను అది ముందుగానే గుర్తించాడు’.
‘ఈ సినిమా తర్వాత ఇంకా 4 దశాబ్దాలు నేను ఉంటాను అన్నాడు, అది నిజంగా వాస్తవం. నటుడిగా ఎంత ఎక్కువ కాలం జీవిస్తాము అనేది మాత్రమే తప్ప, కేవలం ఒక హీరో గా మాత్రమే ఉంటాను అనుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యం తో నాగ్ ని అడిగాడు, ఈ పాత్ర తనకు భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకొని నాగ్ ఒప్పుకున్నాడో తెలీదు కానీ, ఇదే ఈ సినిమా విజయానికి మొదటి మెట్టు అని నేను అనుకుంటున్నాను. అదే విధంగా దేవా క్యారక్టర్ లో ధనుష్ ని తప్ప ఎవరినీ ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీనికి న్యాయం చేయగలడు. తిరుపతి లో బెగ్గర్స్ గుంపులో ధనుష్ కూర్చున్నప్పుడు నేను అతన్ని గుర్తించలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.