Vishwambhara: చిక్కుల్లో పడిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’..సంక్రాంతికి రావడం ఇక కష్టమే!

సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రం లో 5 మేజర్ ఎపిసోడ్స్ ఉంటాయి. వీటికి గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసాడట డైరెక్టర్ వశిష్ఠ.

Written By: Vicky, Updated On : September 9, 2024 5:32 pm

Vishwambhara

Follow us on

Vishwambhara: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి భారీ బడ్జెట్ తో చేస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింభిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. కేవలం ఒక ఐటెం సాంగ్ మరియు క్లైమాక్స్ పార్ట్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారని ఇప్పటికే అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రం లో 5 మేజర్ ఎపిసోడ్స్ ఉంటాయి. వీటికి గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసాడట డైరెక్టర్ వశిష్ఠ. యూవీ క్రియేషన్స్ కూడా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా, హాలీవుడ్ సినిమాలకు పని చేసిన కంపెనీస్ తో VFX వర్క్ చెయ్యిస్తున్నాడట. కేవలం గ్రాఫిక్స్ వర్క్ కోసమే 120 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాకి ఓటీటీ సమస్య వచ్చి పడింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి జరగాల్సిన రేంజ్ లో ఓటీటీ బిజినెస్ జరగడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. నిర్మాతలు ఈ డిజిటల్ రైట్స్ ని 90 నుండి 100 కోట్ల రూపాయలకు అమ్ముదామని అనుకుంటే, ఓటీటీ సంస్థలు కేవలం 40 కోట్ల రూపాయిలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయట. నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రానికి కేవలం 40 కోట్ల రూపాయిలు మాత్రమేనా?, ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఈమధ్య కాలం లో ఓటీటీ బిజినెస్ బాగా పడిపోయింది, దానికి తోడు రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కొత్త సినిమాలేవీ కూడా ఓటీటీ లో సెన్సేషనల్ వ్యూస్ ని దక్కించుకోలేక పోయాయి. అందుకే 40 కోట్ల రూపాయలకు మించట్లేదని సమాచారం. దీనిపై మేకర్స్ అసంతృప్తితో ఉన్నారు, సరైన డీల్ వచ్చే వరకు ఓటీటీ బిజినెస్ ని క్లోజ్ చేయరు నిర్మాతలు.

ఓటీటీ బిజినెస్ అయ్యే వరకు థియేట్రికల్ రిలీజ్ ఉండదు, అంటే ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. మరి ఏమి జరగబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, ‘నా సామి రంగ’ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే సురభి, ఇషా చావ్లా వంటి వారు ఈ సినిమాలో చిరంజీవి కి చెల్లెళ్లుగా నటించబోతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏంఏం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత రిచెస్ట్ చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందని టాక్. త్వరలోనే టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.