Megastar Chiranjeevi Remake: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నాలుగు సినిమాలు చేస్తే అందులో రెండు రీమేక్ సినిమాలే. ‘ఖైదీ నెంబర్ 150’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, ‘గాడ్ ఫాథర్’ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ గా నిల్చింది. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య ‘ చిత్రం తో భారీ హిట్ కొట్టి ఫ్లాప్స్ నుండి గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఆగష్టు 11 వ తేదీన విడుదల అవ్వబోతున్న మెగాస్టార్ లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ కూడా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ కి రీమేక్ గా తెరకెక్కింది.
ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో ఏమాత్రం కూడా అంచనాలు లేవు,కారణం రీమేక్ అవ్వడం వల్లే. ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఎన్నో సార్లు రీమేక్స్ తో విసిగెత్తిపోయాము అంటూ చిరంజీవి ని ట్యాగ్ చేసి చాలా ట్వీట్స్ వేశారు.
‘భోళా శంకర్’ చిత్రమే ఆఖరి రీమేక్ సినిమా అని అందరూ అనుకున్నారు కానీ, ఇంతలోపే ఆయన మరో రీమేక్ చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బ్రో డాడీ’ అనే చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో మోహన్ లాల్ మరియు పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరోలు గా నటించారు. ఈ చిత్రం థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ లో విడుదల అయ్యింది. కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈ చిత్రం.
ఇప్పుడు ఈ చిత్రాన్ని చిరంజీవి చెయ్యడానికి అమితాసక్తి ని చూపిస్తున్నాడు. ఆయనతో పాటుగా మరో హీరో గా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతుండగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.ఈ ఏడాది లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.