Keerthy Suresh: ప్రసుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో అందంతో పాటు అద్భుతమైన నటన కనబర్చే హీరోయిన్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో కీర్తి సురేష్ కచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే తన నటనతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్న మహానటి ఆమె. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సావిత్రి మరియు సౌందర్య తర్వాత అలాంటి మహానటి ప్రస్తావన వస్తే కీర్తి సురేష్ పేరు ప్రస్తావించకుండా ఉండలేము.
తక్కువ సమయం లో ఆమె సాధించిన ప్రతిష్ట అలాంటిది, పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చెయ్యడానికి సిద్దపడే నటి ఆమె. అయితే రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ముఖం నిండా గాయాలతో ఒక వీడియో అప్లోడ్ చేసింది. చూసేందుకు భయం పుట్టిస్తున్న ఆ వీడియో ని చూసి అభిమానులు కీర్తి కి ఏమైంది అంటూ భయపడ్డారు.
వాళ్ళు అలా భయపడుతుండగా కీర్తి సురేష్ అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే కీర్తి సురేష్ మరియు సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో గత ఏడాది సాని కాయిదం అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలై మంచి రివ్యూ ని దక్కించుకుంది.
ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం కీర్తి సురేష్ వేసుకుంటున్న మేకప్ కి సంబంధించిన వీడియో ని షేర్ చెయ్యగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.రీసెంట్ గానే ‘దసరా’ సినిమాతో భారీ హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న కీర్తి సురేష్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తో ‘భోళా శంకర్’ అనే చిత్రం లో ఆయనకీ చెల్లెలుగా నటిస్తుంది. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకుడు. ఆగస్టు 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతుంది ఈ చిత్రం.
View this post on Instagram