Chiranjeevi Vijay phone call: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నప్పటికీ , ఇసుమంత గర్వం కూడా లేని హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. తన తోటి హీరోలు సూపర్ హిట్ కొడితే మనస్ఫూర్తిగా అభినందిస్తాడు , అదే విధంగా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ని చూసి కొత్త తరం నటీనటులు కూడా ఎన్నో విషయాలను నేర్చుకుంటుంటారు. తాజాగా మరోసారి తన ఉన్నతమైన మనసుని చాటుకున్నాడు మెగాస్టార్. రీసెంట్ గానే తమిళ హీరో సీఎం సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నేడు స్వయంగా విజయ్ కి ఫోన్ చేసి, సుమారుగా 15 నిమిషాల పాటు సంభాషించాడట.
తమిళనాడు రాష్ట్రానికి సీఎం గా బాధ్యతలు చెప్పినట్టినందుకు ముందుగా విజయ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసాడట. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత నాలుగు రోజుల వరకు తమిళనాడు లో జరిగిన హై డ్రామా గురించి కూడా చిరంజీవి ప్రస్తావించాడట. ఇక విజయ్ రీసెంట్ గానే ‘మీ మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని చూశానని, మీ కామెడీ టైమింగ్ ని చాలా కాలం తర్వాత ఆరంభం నుండి ఎండింగ్ వరకు ఎంజాయ్ చేశానని , అదే విధంగా నా ‘జన నాయగన్’ చిత్రం లీక్ అయ్యినప్పుడు సపోర్టుగా నిలిచినందుకు ధన్యవాదాలు అని కూడా మెగాస్టార్ కి చెప్పినట్టు సమాచారం. ఇలా వీళ్లిద్దరి మధ్య సుదీర్ఘంగా ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తో విజయ్ కి ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన తండ్రి చంద్రశేఖర్ చిరంజీవి తో ఏకంగా మూడు సూపర్ హిట్ సినిమాలు చేసాడు.
ఈ మూడు సినిమాల షూటింగ్స్ సమయంలో విజయ్ రెగ్యులర్ గా సెట్స్ కి వస్తుండేవాడని, చిరంజీవి అతన్ని చాలా బాగా చూసుకునేవాడని తెలుస్తోంది. అంతే కాదు , రాజకీయాల కారణంగా సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటించిన చిరంజీవి , రీ ఎంట్రీ ఇచ్చింది ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం తో , ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే, బాహుబలి తర్వాత వంద కోట్ల షేర్ మార్కుని అందుకున్న రెండవ తెలుగు చిత్రమిది. ఈ సినిమా విజయ్ ‘కత్తి’ చిత్రానికి రీమేక్. ఈ రీమేక్ రైట్స్ స్వయంగా విజయ్ తన నిర్మాతతో మాట్లాడి చిరంజీవి కి ఉచితంగా ఇప్పించాడని అప్పట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్వయంగా చెప్పుకొచ్చాడు. అలా ఎప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
