Megastar Chiranjeevi Holiday Trip: ‘ఆచార్య’ కలెక్షన్స్ పై ట్రేడ్ వర్గాలు కూడా జాలి చూపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోయారు. మరోపక్క బయ్యర్లకు కూడా భారీ నష్టాలు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘చిరంజీవి – రామ్ చరణ్’ ఇద్దరు కలిసి చేసిన చిత్రం అవ్వడంతో ఆచార్య చిత్రాన్ని భారీ రేట్లకు కొనుగోలు చేశారు. అయితే, చాలా ఏరియాల్లో ఈ సినిమా కనీస కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిలపడింది
లాభాల మాట దేవుడెరుగు.. అసలు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కూడా అసాధ్యమే. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి బయ్యర్లకు 40% నుంచి 60% వరకూ నష్టం వచ్చే అవకాశం ఉంది. నిజానికి.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆచార్య భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో దారుణంగా విఫలం అయ్యాడు.
Also Read: Tanushree Dutta Accident: బాలయ్య హీరోయిన్ కి యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉంది అంటే ?
అసలుకే, ఎక్కువ రేట్లకు కొనడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నష్టాలే కనిపిస్తున్నాయి. సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిందనే నిరాశలో సినిమా యూనిట్ ఉంది. అలాగే, కొరటాల కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నాడు. బయ్యర్లకు ఇచ్చిన మాట, చెప్పిన హామీను పట్టించుకునే స్థితిలో ఆయన లేడు. ఇక నిర్మాత నిరంజన్ రెడ్డి బయ్యర్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు.
ఇలాంటి సమయంలో బయ్యర్లకు కనిపించిన ఒకే ఒక్క వ్యక్తి చిరంజీవి. మెగాస్టార్ కోసం ఆచార్య బయ్యర్లు అంతా గత నాలుగు రోజుల నుంచి మెగాస్టార్ హౌస్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇది తెలిసి వెళ్ళాడో, లేక.. తెలియక వెళ్ళాడో తెలియదు గానీ.. మెగాస్టార్ మాత్రం తన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లారు.
చిరంజీవి తన సతీమణితో కలిసి ప్రస్తుతం యూఎస్, యూకే ట్రిప్ లో ఉన్నారు. సరే వచ్చాకే చూసుకుందాం అనుకున్న బయ్యర్లకు తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది. చిరంజీవి నెలరోజుల తర్వాతే మళ్లీ ఇండియా తిరిగి వస్తారని టాక్ నడుస్తోంది.
దాంతో ఇప్పుడు బయ్యర్లంతా ఏమి చేయాలో అర్ధం కానీ పరిస్థితి లోకి వెళ్లిపోయారు. అయినా.. మేము ఇక్కడ ఆత్మహత్య స్థితిలో ఉంటే.. మీకు సరదాలు కావాలా చిరంజీవి అంటూ బయ్యర్లు ఆవేశంగా ఉన్నారు.
Also Read:Acharya Collections: 4 రోజులకే చేతులెత్తేసిన ఆచార్య.. మరీ ఇంత తక్కువా ?
Recommended Videos